లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై యువ హీరో కార్తికేయ, నేహా శెట్టి జంటగా విడుదలవనున్న చిత్రం ‘బెదురులంక 2012’. ఇటీవల విడుదలైన కాన్సెప్ట్ మరియు టైటిల్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన లభించగా, తాజాగా వినూత్నమైన ప్రీ-లుక్ ని విడుదల చేసి చిత్రం పై అంచనాలని పెంచేసారు. బుధవారం, నవంబర్ 30న పొద్దున 10:40 కి ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేయనుండగా నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని, సమర్పకులు యువరాజ్ మరియు దర్శకుడు క్లాక్స్ చిత్ర కాన్సెప్ట్ పై చాలా నమ్మకంగా ఉన్నారు.
కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథ నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కార్తికేయ పాత్రతో పాటు స్ట్రాంగ్ కంటెంట్, కడుపుబ్బా నవ్వించే వినోదం సమపాళ్లలో ఉందని నిర్మాతలు చెబుతున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన పాటలందించగా, దివంగత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ చిత్రంలో ఒక పాట రాయడం విశేషం.
Also Read : కార్తికేయ సినిమా టైటిల్ ‘బెదురులంక 2012’