Tuesday, June 16, 2026
Homeసినిమాజక్కన్నకు మించి తెరకెక్కించేది ఎవరు?

జక్కన్నకు మించి తెరకెక్కించేది ఎవరు?

‘బాహుబలి’ ప్రీక్వెల్ గా రూపొందిన ‘బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో దాదాపు డెభ్భై శాతం పూర్తయిన వెబ్ సీరియస్ ను నెట్ ఫ్లిక్స్ క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే వెబ్ సీరిస్ ను 200 కోట్ల బడ్జెట్ తో తిరిగి పునరుద్ధరించాలని చూస్తున్నారు. గతంలో ఈ వెబ్ సీరిస్ కోసం పనిచేసిన టాలీవుడ్ దర్శకులు ప్రవీణ్ సత్తార్, దేవకట్టాతో పాటు నటీనటులను కూడా చేంజ్ చేసి ఈ సీరిస్ ను మళ్లీ చేపట్టాలని భావిస్తున్నారు. ‘బాహుబలి’ చిత్రంలో రమ్యకృష్ణ నటించిన శివగామి పాత్ర కోసం వామిక గబ్బిని ఎంపిక చేశారని తెలుస్తోంది.

తమిళ, మలయాళ, హిందీ, పంజాబి ప్రేక్షకులకు వామిక గబ్బి సుపరిచితం. తెలుగులో కూడా ఈమె ’భలే మంచి రోజు‘ చిత్రంలో నటించింది. ఇదిలా వుండగా.. ఈ సీరిస్ లో నయనతార కూడా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె పాత్ర ఏంటన్నది ఇంకా తెలియాల్సి వుంది. గతంలో భారీ ఖర్చుతో నిర్మించిన ఇదే సీరిస్ దాదాపు డెభ్బై శాతం పూర్తయినా  ఆ ఫుటేజ్ ను స్రాప్ కింద కొట్టేసిన నెట్ ఫ్లిక్స్ క్వాలిటీకి ఎంత ప్రాముఖ్యత నిస్తోందో తెలుస్తోంది. జక్కన్నతో పోటీ పడుతూ ఆ రేంజ్ లో బిఫోర్ ది బిగింగ్ సీరిస్ ను ఎవరు తెరకెక్కించేది ఎవరో తెలియాల్సి వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular