Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ప్రభుత్వ భూముల అమ్మకాల్లో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ బినామీ ల కోసమే భూముల అమ్మకాలు చేపట్టారని ఆరోపించారు. గతంలో కూడా రియల్ భూమి పెరిగినట్లు ప్రచారం చేసి – రియల్ భూమ్ కోసమే అమ్ముతున్నట్లు ఉందని గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మండిపడ్డారు. ప్రభుత్వ భూములు అమ్మితే భవిష్యత్ లో స్మశానాలకు కూడా స్థలం ఉండదని రేవంత్ అన్నారు.  ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మడానికి వెళ్తే కేసీఆర్-హరీష్ రావు- కేటీఆర్ అడ్డుకొని నానా రచ్చ చేశారని, ఈ- ఆక్షన్ లో కేసీఆర్ బినామీ కంపెనీలు భూములు దక్కించుకున్నాయని ఆరోపించారు.

సిద్దపేట కలెక్టర్ భు భాగోతాలు బయట పెడతా…

జుపెల్లీ రామేశ్వర్ రావు కంపెనీలు 18 ఎకరాలు కొన్నది.- సిద్దిపేట కలెక్టర్ వెంకట్ రామిరెడ్డి సంస్థ రాజ్ పుష్ప  7 ఎకరాలు కొన్నదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆక్వా స్పెస్ సంస్థకు 390 కోట్లు- రాజ్ పుష్ప సంస్థకు 138 కోట్లు లాభం గడించాయని, 3వేల కోట్లు రావాల్సిన భూములను- 2వేల కోట్లకే పరిమితం చేశారన్నారు. ప్రెస్టీజి సంస్థకు- మంత్రి కేటీఆర్ కు దగ్గర సంబంధాలు ఉన్నాయి. సోమేశ్ కుమార్- కేటీఆర్ లంచాలు తీసుకొని భూముల గోల్ మాల్ చేశారు.  50 ఎకరాలు ఉన్న భూమి ఎకరానికి ఒకో రేటు ఎలా ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఒకే గ్రామంలో ఉన్న ఒక్క ఎకరాకు 60 కోట్లు- మిగిలిన 48 ఎకరాలు 30 నుంచి 40 కోట్లకు ఎలా ధర పలుకుతుందన్నారు.

సిద్దిపేట కలెక్టర్ మిగతా వాళ్ళు ఎవ్వరూ టెండర్లు వేయకుండా ఫోన్ చేసి బెదిరించారని పిసిసి అధ్యక్షుడు ఆరోపించారు.  టెండర్లు వేస్తే ప్రభుత్వ అనుమతులు ఇవ్వమని హెచ్చరించారని, టిఆర్ఎస్ – కేసీఆర్ కు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్న కంపెనీలకే భూములు అప్పజెప్పారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కోకాపేట లో 50 కోట్లకు తక్కువ ధర లేదని, అమ్మిన భూముల్లో 50 అంతస్తుల భవనాలకు అనుమతి ఇవ్వబోతోందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 1000 కోట్ల లూటీ జరిగిందని, గతంలో లిక్కర్ మాఫియా లెక్క- ఇప్పుడు టీఆరెస్ ప్రభుత్వం ల్యాండ్ మాఫియాకు తెరలేపిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. 60 కోట్లకు అమ్మిన భూమి తప్ప మిగతా భూమినంతా మళ్ళీ టెండర్లు పిలువాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. స్విస్ ఛాలెంజ్ విధానం ప్రకారం టెండర్లు పిలువాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజ్ పుష్ప సంస్థ నిబంధనలకు విరుద్దంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని  త్వరలోనే రాజ్ పుష్ప సంస్థ- వెంకట్రామిరెడ్డి భాగోతం బయపెడుతానని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ దోపిడీ పరాకాష్టకు చేరుకుందని, తరాల నుంచి వస్తున్న భూములను అమ్మే హక్కు కేసీఆర్ కు లేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. భూ అమ్మకాల్లో  వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. నాలుగైదు రోజుల్లో ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోతే కేంద్ర హోంమంత్రి- ప్రధానికి ఫిర్యాదు చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. కిషన్ రెడ్డి కి కూడా నా దగ్గర ఉన్న ఆధారాలు ఇస్తానన్నారు. ఫిర్యాదు పై కేంద్రం- బీజేపీ విచారణకు అదేశిస్తుందా లేదా చూద్దామని, టీఆరెస్- బీజేపీ రహస్య ఒప్పందం ఏంటో తెలుస్తుందన్నారు. భూ ఆక్రమణల పై పార్లమెంట్ లో మాట్లాడుతానని, తెలంగాణ రాష్ట్ర విభజన పై – కృష్ణా జలాల పై పార్లమెంట్ లో పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com