Thursday, January 23, 2025
HomeTrending NewsBJP Chevella: ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాం - అమిత్ షా

BJP Chevella: ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాం – అమిత్ షా

తెలంగాణలో ముస్లింలకు అమలు చేస్తున్న అనధికార రిజర్వేషన్లను తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత అమిత్ షా ప్రకటించారు. ఆ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్‍టీ, బీసీలకు కేటాయిస్తామని అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల  వేదికగా ఆదివారం సాయంత్రం జరిగిన విజయ సంకల్ప సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమర శంఖం పూరించారు. ఈ సందర్భంగా అమిత్ శ మాట్లాడుతూ కెసిఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని అమిత్ షా విమర్శించారు. ఓవైసీ అజెండాను తెలంగాణలో బీఆర్ఎస్ అమలు చేస్తోందని ఆరోపించారు.

10వ తరగతి పేపర్ లీకేజీ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‍ను అరెస్ట్ చేయడం పట్ల అమిత్ షా స్పందించారు. బీజేపీ కార్యకర్తలు అరెస్టులకు భయపడరని, పోరాడుతూనే ఉంటారని అన్నారు. “జైలులో పెడితే భయపడతారని ఆయన (కేసీఆర్) అనుకుంటున్నారు. కేసీఆర్ విను.. మీ వేధింపులకు మా కార్యకర్తలు అసలు భయపడరు. మిమ్మల్ని గద్దె దింపే వరకు మా పోరాటం అసలు ఆగదు” అని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో పోలీసులను పూర్తిగా రాజకీయంగా మార్చేశారని ఆయన ఆరోపించారు.

టీఎస్‍పీఎస్‍సీ పేపర్ లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అమిత్ షా డిమాండ్ చేశారు. యువత జీవితాలతో సీఎం కేసీఆర్ ఆడుకుంటున్నారని, పేపర్ లీకేజీపై మౌనంగా ఎందుకున్నారని ఆయన ప్రశ్నించారు.

కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చే ముందు అసలు సినిమా చూసే ముందు.. తెలంగాణలో ట్రైలర్ చూపిస్తాం తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం. ప్రజల దృష్టి మరల్చేందుకే టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్‍గా కేసీఆర్ మార్చారు. తెలంగాణలోనే కేసీఆర్ పని అయిపోనుంది. కానీ ఆయన దేశం గురించి మాట్లాడుతున్నారు. ప్రధాన మంత్రి కావాలని కేసీఆర్ కలలు కంటున్నారు. అక్కడ.. ఇక్కడ.. తిరుగుతున్నారు. తెలంగాణ ప్రజలు అంతా అర్థం చేసుకుంటున్నారు. ప్రధాన మంత్రి కుర్చీ ఖాళీ లేదు. ఆ పీఠాన్ని మళ్లీ నరేంద్ర మోదీనే అధిష్టించనున్నారు” అని అమిత్ షా అన్నారు.

తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని అమిత్ షా విమర్శించారు. బీఆర్ఎస్ మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న నిధులను బీఆర్ఎస్ పార్టీ దోచుకుంటోందని ఆయన విమర్శించారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకాలు సామాన్య ప్రజలకు అందకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటోందని అమిత్ షా ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్