Thursday, March 28, 2024
Homeస్పోర్ట్స్Ranji Trophy Semis : బెంగాల్ జోరు - ధీటుగా సౌరాష్ట్ర

Ranji Trophy Semis : బెంగాల్ జోరు – ధీటుగా సౌరాష్ట్ర

రంజీ ట్రోఫీ మొదటి సెమీ ఫైనల్లో మధ్య ప్రదేశ్ పై బెంగాల్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో 438 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నిన్న తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన మధ్య ప్రదేశ్ 2 వికెట్లకు 56 పరుగుల వద్ద  నేటి మూడోరోజు ఆట మొదలు పెట్టింది. సరన్ష్ జైన్ -65;  శుభమ్ శర్మ-44 పరుగులతో రాణించగా, మిగిలిన వారు విఫలమయ్యారు, దీనితో 170 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ లో 268 పరుగుల ఆధిక్యం బెంగాల్ సాధించింది.

బెంగాల్ బౌలర్లలో ఆకాష్ దీప్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. షాబాజ్ అహ్మద్ కు రెండు; ముఖేష్ కుమార్, ఇషాన్ పోరెల్ కు చెరో వికెట్ దక్కాయి.

ఫాలో ఆన్ ఇవ్వకుండా నేడు రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన బెంగాల్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 59 పరుగులు చేసింది. ఓపెనర్లు కరణ్ లాల్ -19; అభిమన్యు ఈశ్వరన్-17 పరుగులు చేసి ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ లతో అదరగొట్టిన సుదీప్-12; అనుష్టుప్-9 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తంగా 327 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

బెంగుళూరులో జరుగుతోన్నరెండో సెమీ ఫైనల్లో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 364 పరుగులు చేసి కర్ణాటకకు ధీటైన జవాబు ఇస్తోంది. 2  వికెట్లకు 76 పరుగుల వద్ద నేడు రెండో రోజు ఆట మొదలు పెట్టిన సౌరాష్ట్ర జట్టులో హార్విక్ దేశాయ్ 33 పరుగులు చేసి ఔట్ కాగా, షెల్డాన్ జాక్సన్- కెప్టెన్ అర్పిత్ వాసవాద లు నాలుగో వికెట్ కు 232 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. జాక్సన్ 23 ఫోర్లు, 2  సిక్సర్లతో 160 పరుగులు చేసి ఔటయ్యాడు. నేడు మూడోరోజు ఆట ముగిసే సమయానికి కెప్టెన్ అర్పిత్-112; చిరాగ్ జానీ -19 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో సౌరాష్ట్ర ఇంకా 43 పరుగులు వెనకబడి ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్