నాగపూర్  టెస్టులో ఇండియా ఆధిక్యం ప్రదర్శిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్ లో9వ టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ అర్ధ సెంచరీలు సాధించారు. ఒక వికెట్ నష్టానికి 77 పరుగులతో నేడు రెండో రోజు ఆట మొదలు పెట్టిన ఇండియా 118 వద్ద నైట్ వాచ్ మెన్ గా వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (23) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన పుజారా (7); కోహ్లీ (12); సూర్య కుమార్ యాదవ్ (8); శ్రీకర్ భరత్ (8) విఫలమయ్యారు.

రోహిత్ శర్మ 120 పరుగులు చేసి ఆరో వికెట్ గా వెనుదిరిగాడు. జడేజా-అక్షర్ లు ఎనిమిదో వికెట్ కు అజేయంగా 81 పరుగులు జోడించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. జడేజా-66; అక్షర్ పటేల్-52 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇండియా 144 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

ఈ టెస్టుతోనే అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగ్రేటం చేసిన ఆస్ట్రేలియా బౌలర్ టాడ్ మర్ఫి తొలి మ్యాచ్ లోనే ఐదు వికెట్లు సాధించి ఆకట్టుకున్నాడు. పాట్ కమ్మిన్స్, లియాన్ చెరో వికెట్ తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *