Saturday, September 21, 2024
Homeస్పోర్ట్స్లక్నోపై బెంగుళూరు విజయం

లక్నోపై బెంగుళూరు విజయం

IPL-2022: ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 పరుగులతో విజయం సాధించింది.  బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ 96 పరుగులతో సత్తా చాటగా, హాజెల్ వుడ్ బౌలింగ్ లో రాణించి నాలుగు వికెట్లతో లక్నో బ్యాటింగ్ లైనప్ దెబ్బతీశాడు

నవీ ముంబైలోని డా. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో  లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు 7 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు (ఓపెనర్ అర్జున్ రావత్-4, విరాట్ కోహ్లీ-డకౌట్) కోల్పోయింది. మాక్స్ వెల్ 23; ప్రభు దేశాయ్ 10 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్ మెన్ త్వరగా ఔటవుతున్నా కెప్టెన్ డూప్లెసిస్ మాత్రం క్రీజ్ లో నిలదొక్కుకుని ధాటిగా ఆడాడు,  64 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 96 పరుగులు చేసి జేసన్ హోల్డర్ బౌలింగ్ లో స్టోనిస్ పట్టిన క్యాచ్ కు ఔటై నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. చివర్లో షాబాజ్ అహ్మద్-26; దినేష్ కార్తీక్ 13 పరుగులు చేశారు. దీనితో బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో చమీర, జేసన్ హోల్డర్ చెరో రెండు; క్రునాల్ పాండ్యా ఒక వికెట్ పడగొట్టారు.

లక్నో 17 పరుగుల వద్ద మొదటి వికెట్ (డికాక్-3) కోల్పోయింది. మనీష్ పాండే కూడా కేవలం 6 మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ రాహుల్ -30 పరుగులు చేసి ఔటయ్యాడు. జట్టులో క్రునాల్ పాండ్యా 42 పరుగులతో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. చివర్లో స్టోనిస్-24; హోల్డర్-16 పరుగులు చేశారు. మిగిలిన వారు విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 163 పరుగులు మాత్రమే చేయగలిగింది.  బెంగుళూరు బౌలర్లలో జోష్ హాజెల్ వుడ్ నాలుగు; హర్షల్ పటేల్ రెండు; సిరాజ్, మాక్స్ వెల్ చెరో వికెట్ పడగొట్టారు.డూప్లెసిస్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : ఐపీఎల్: చాహల్ మ్యాజిక్: పోరాడి ఓడిన కోల్ కతా

RELATED ARTICLES

Most Popular

న్యూస్