Sunday, November 24, 2024
Homeఅంతర్జాతీయంఅధికార నివాసం ఖాళీ చేసిన బెంజిమెన్

అధికార నివాసం ఖాళీ చేసిన బెంజిమెన్

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రిగా పనిచేసిన బెంజిమేన్ నెతన్యాహు జెరూసలేం లోని బాల్ఫోర్ వీధిలో ఉండే ప్రధాని అధికారిక నివాసం ఖాళీ నేడు ఖాళీ చేశారు. ప్రధాని హోదాలో ­12 సంవత్సరాలపాటు అయన ఈ నివాసంలో ఉన్నారు. గత రెండు మూడు రోజులనుంచే నేతన్యాహు కు చెందిన సామాన్ల ట్రక్కులు దశలా వారీగా ఈ నివాసం నుంచి వెళ్ళాయి.

నెతన్యాహు కుటుంబం తమ చివరి షాబాత్ ను ఈ నివాసంలో గడిపింది. ఇజ్రాయెల్ లో వారంలో చివరి రోజును షాబాత్ గా పరిగణిస్తారు. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు ఇజ్రాయెల్ ప్రజలు పని చేయరు, ఆఫీసులు మూతపడి వుంటాయి. హోటళ్ళు, రవాణా సౌకర్యాలు కూడా పరిమిత సంఖ్యలోనే ఉంటాయి.  ఈ సమయంలో క్యాండిల్ దీపాలు వెలిగించి ప్రార్ధనలు, విందులతో ఆహ్లాదంగా గడుపుతారు.

జూన్ 13న నెతన్యాహు ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది.  బెంజిమేన్ స్థానంలో నేఫ్తాలి బెన్నెట్ కొత్త ప్రధానిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అధికారిక నివాసం ఖాళీ చేయడానికి ఒక నెలరోజులపాటు సమయం ఇవ్వాల్సిందిగా కొత్త ప్రధానిని బెంజిమేన్ విజ్ఞప్తి చేశారు.

వరుసగా 12 సంవత్సరాలపాటు దేశాధినేతగా వ్యవహరించిన బెంజిమేన్ గతంలో మరో మూడేళ్ళు కూడా ప్రధానిగా పని చేశారు.  మొత్తం 15 సంవత్సరాలపాటు అయన ఇజ్రాయెల్ ప్రధానిగా పనిచేశారు. దేశాన్ని వ్యవసాయ, ఆధునిక సాంకేతిక రంగాల్లో  పురోగతి వైపు నడిపించారు. యుద్ధ పరికరాల తయారీ రంగంలో కూడా స్వయం సమృద్ధి దిశగా దేశాన్ని తీర్చి దిద్దారు. పాలస్తీనాతో నిత్య పోరాటం చేయాల్సిన ఇజ్రాయెల్ ఓ వైపు యుద్ధాలు చేస్తునే మరోవైపు అభివృద్ధి పై దృష్టి సారిస్తూ వస్తోంది, పలు దేశాలకు తమ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ వస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్