New Variant Central Government :
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొవిడ్ కొత్త వేరియంట్‌పై రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. విదేశీ ప్రయాణికులకు తప్పనిసరిగా స్క్రీనింగ్, కొవిడ్ పరీక్షలు పకడ్బందీగా చేయాలని ఆదేశించింది. దక్షిణాఫ్రికా, హాంగ్‌కాంగ్ నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కాగా, B.1.1529 పేరు గల ఈ వేరియంట్ దక్షిణాఫ్రికాలో అసాధారణ రీతిలో మ్యుటేషన్లకు గురవుతోందని, ఈ వేరియంట్‌కు సంబంధించి ఇప్పటికే 22 కేసులను గుర్తించినట్లు దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం (NICD) కూడా వెల్లడించింది.
Also Read : కొవిడ్ చికిత్సలో సరికొత్త అధ్యాయం