Sunday, January 19, 2025
Homeసినిమానాగార్జునతో అనుకుంటే.. రవితేజతో సెట్ అయ్యిందా..?

నాగార్జునతో అనుకుంటే.. రవితేజతో సెట్ అయ్యిందా..?

సినిమా చూపిస్తా మావ సినిమాతో రైటర్ గా ఇండస్ట్రీకి పరిచయమై అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న రైటర్ బెజవాడ ప్రసన్న. డైరెక్టర్ నక్కిన త్రినాధరావు తెరకెక్కించిన అన్ని సినిమాలకు కథ – మాటలు అందించాడు ప్రసన్న. దాదాపు ప్రసన్న వర్క్ చేసిన సినిమాలు అన్నీ సక్సెస్ అవ్వడంతో బిజీ అయ్యాడు. అయితే.. ప్రసన్నను నాగార్జున డైరెక్టర్ గా పరిచయం చేయనున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. మలయాళంలో విజయం సాధించిన ఓ మూవీని ప్రసన్న డైరెక్షన్ లో రీమేక్ చేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు.

అయితే.. నాగార్జునతో ప్రసన్న చేయాలి అనుకున్న సినిమా బడ్జెట్ విషయంలో భేదాభిప్రాయాలు రావడంతో ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని చిట్టూరి శ్రీనివాస్ నిర్మించాలి అనుకున్నారు. అయితే.. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో మరో డైరెక్టర్ కోసం చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ధమాకా సినిమాతో రవితేజకి భారీ సక్సెస్ అందించిన రైటర్ ప్రసన్న తాజాగా మాస్ మహారాజాకి ఓ కథ వినిపించి లాక్ చేసుకున్నాడని తెలుస్తుంది. రవితేజ ఇప్పటికే చాలా మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

ఇప్పుడు రైటర్ ప్రసన్నను దర్శకుడిగా పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం  చిరంజీవి, కళ్యాణ్ కృష్ణ సినిమాకు కథ , స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు ప్రసన్న కుమార్. ఈ సినిమా అయ్యాక రవితేజతో తన డైరెక్షన్ సినిమా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడని టాక్ వినిపిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్