ఈ దసరాకి మూడు సినిమాలు వస్తున్నాయి. అందులో రెండు స్ర్టైయిట్ సినిమాలు.. ఒకటి డబ్బింగ్ సినిమా. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు స్ట్రైయిట్ సినిమాలు కాగా, లియో డబ్బింగ్ సినిమా. భగవంత్ కేసరి, లియో ఒకే రోజున ఈ నెల 19న విడుదల అవుతుంటే.. తర్వాత రోజున అంటే.. ఈ నెల 20న టైగర్ నాగేశ్వరరావు చిత్రం విడుదల అవుతుంది. అయితే.. ఈ మూడు చిత్రాలు రిలీజ్ అవుతున్నప్పటికీ.. ముఖ్యంగా బాలయ్య, రవితేజ మధ్య పోటీ ఉంది. దీంతో దసరా బరిలో నిలుస్తున్న భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు ఇద్దరిలో ఎవరు విజేతగా నిలుస్తారు అనేది ఆసక్తిగా మారింది.
ఇదిలా ఉంటే.. టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు పాన్ ఇండియా రైటర్ విజయేంద్రప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ… పుష్ప తర్వాత తనని ట్రైలర్ తోనే ఆ కాలంలోకి తీసుకెళ్లిన సినిమా టైగర్ నాగేశ్వరావు అని.. అందుకనే ఈ సినిమా డైరెక్టర్ కి కాల్ చేసి అభినందించాను అని చెప్పారు. ఇక రవితేజ యాక్టింగ్ గురించి.. ఆయన టాలెంట్ గురించి తెలిసిందే. భారతదేశం అంతా ఆయన కీర్తి పతాకాన్ని ఎగరవేయాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
ఇంత వరకు బాగానే ఉంది కానీ.. ఆతర్వాత దుర్గమ్మ ముందు ఎవరూ నిలబడలేరు.. ఆ తల్లి వాహనమైన టైగర్ ముందు కూడా ఎవరూ నిలబడలేరు.. ఈ దసరా నీదే అన్నారు. విజయేంద్రప్రసాద్ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ దసరాకి బాలయ్య భగవంత్ కేసరి సినిమా వస్తుందని తెలుసు. ఆయనప్పటికీ ఆయన అలా మాట్లాడడం వెనుక మర్మం ఏంటి..? బాలయ్య సినిమా పై ఆయనకు నమ్మకం లేదా..? లేక వేరే కారణం ఏదైనా ఉందా అనేది ఆసక్తిగా మారింది.
Also Read: గట్టిపోటీ మధ్యలో బరిలో దిగుతున్న టైగర్ నాగేశ్వరరావు