Tuesday, September 17, 2024
Homeసినిమాశ్రీలీల లుక్‌ను విడుదల చేసిన ‘భగవంత్ కేసరి’ టీమ్

శ్రీలీల లుక్‌ను విడుదల చేసిన ‘భగవంత్ కేసరి’ టీమ్

బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న యూనిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘భగవంత్ కేసరి’ టీజర్ లో మునుపెన్నడూ చూడని లుక్ లో కనిపించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్ గత రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. పోస్టర్‌ పై శ్రీలీల తన అందమైన చిరునవ్వుతో ఆకట్టుకుంది.

బ్లాక్ ఎథ్నిక్ వేర్ ధరించి, ప్లజంట్ గా కనిపిస్తుంది. సింపుల్ గర్ల్ గా నల్ల దారం, చెవిపోగులు ధరించింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ రాంపాల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. భగవంత్ కేసరి విజయదశమి (దసరా)కి థియేటర్లలో విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్