Sunday, January 19, 2025
HomeసినిమాShiva Rajkumar: 'భక్త కన్నప్ప'లో శివుడు ప్రభాస్ కాదా..? మరి.. ఎవరు..?

Shiva Rajkumar: ‘భక్త కన్నప్ప’లో శివుడు ప్రభాస్ కాదా..? మరి.. ఎవరు..?

‘భక్త కన్నప్ప’.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని సినిమా. ఈ చిత్రాన్ని ప్రభాస్ తో చేయలి అనుకున్నారు కానీ.. ఆయన కోరిక తీరకుండానే వెళ్లిపోయారు. అలాగే భక్త కన్నప్ప చిత్రాన్ని మంచు విష్ణు కూడా చేయాలి అనుకున్నారు. చాలా సంవత్సరాల నుంచి కథ పై కసరత్తు చేశారు. దీంతో భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ నటిస్తాడా..? మంచు విష్ణు నటిస్తాడా..? అనుకుంటే.. ఆఖరికి మంచు వారబ్బాయి విష్ణునే చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇటీవల ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. మోహన్ బాబు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

అయితే.. ఈ సినిమాలో శివుడు పాత్రను ప్రభాస్ పోషించనున్నాడని… ఇక పార్వతి పాత్రను నయనతార పోషిస్తుందని వార్తలు వచ్చాయి. ఈ వార్త బయటకు వచ్చినప్పుడు ఇదేదో గ్యాసిప్ అనుకున్నారు కానీ.. ఆతర్వాత నిజమే అని తెలిసింది. దీంతో భక్త కన్నప్ప మూవీ పై మరింత క్రేజ్ పెరిగింది. అయితే.. ఇప్పుడు ఈ సినిమాలో శివుడుగా కనిపించేది ప్రభాస్ కాదని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. శివుడు పాత్రలో శివ రాజ్ కుమార్ కనిపిస్తారట. అయితే.. శివుడి మనిషి రూపంలో మాత్రం ప్రభాస్ కనిపిస్తాడట.

ప్రభాస్ ఈ మూవీకి తక్కువ డేట్స్ ఇవ్వడం వలన ఇలా ప్లాన్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఆదిపురుష్ లో రాముడుగా కనిపించిన ప్రభాస్ భక్త కన్నప్పలో శివుడు పాత్రలో కనిపిస్తాడని డార్లింగ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతూ.. చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇప్పుడు శివుడు పాత్రలో కనిపించేది ప్రభాస్ కాదని.. శివ రాజ్ కుమార్ అని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇందులో ప్రభాస్ కనిపించే పాత్ర నిడివి తక్కువే అయినా.. ఆ పాత్రను బాగా డిజైన్ చేస్తే చాలు అనుకుంటున్నారు ఫ్యాన్స్. మరి… మంచు విష్ణు ప్రచారంలో ఉన్న ఈ వార్త పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్