Saturday, January 18, 2025
Homeసినిమా‘భళా చోర భళా’కు హాస్య బ్రహ్మ ఆశీస్సులు

‘భళా చోర భళా’కు హాస్య బ్రహ్మ ఆశీస్సులు

ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ, చింటు, శాంతి దేవగుడి, రామ్ జగన్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో యాక్టివ్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన చిత్రం ‘భళా చోర భళా’. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మిస్టరీ చిత్రానికి ఏ. ప్రదీప్ (స్వర్గీయ ఏవీఎస్‌ తనయుడు) దర్శకత్వం వహించగా.. ఏ. జనని ప్రదీప్ నిర్మించారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 26న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం చిత్రయూనిట్‌కు ఆశీస్సులు అందించారు.

‘స్వర్గీయ ఏవీఎస్ కుమారుడు ప్రదీప్ దర్శకత్వం వహించిన ‘భళా చోర భళా’. అహా.. ఏం దొంగగాడురా వీడు అనేలా ఉంది టైటిల్. ఈ సినిమా ఆగస్ట్ 26న థియేటర్లలో విడుదలవుతోంది. మీరందరూ చూసి.. ఏవీఎస్‌ని ఎలా అయితే ఆదరించారో.. అంత గొప్పగా ప్రదీప్‌ని కూడా ఆశీర్వదించాలని కోరుతూ.. మీ ఆశీర్వాదంతో ప్రదీప్ ఇంకా ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని.. నేను మనస్ఫూర్తిగా వేంకటేశ్వర స్వామిని కోరుకుంటూ.. మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. భళా చోర భళా ప్రతి ఒక్కరూ చూడాల్సిందిగా కోరుతున్నాను”  అని బ్రహ్మానందం చిత్రయూనిట్‌కు ఆశీస్సులు అందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్