Saturday, January 18, 2025
Homeసినిమాశ్రీవిష్ణు ‘భళా తందనాన’ రిలీజ్ డేట్ ఫిక్స్

శ్రీవిష్ణు ‘భళా తందనాన’ రిలీజ్ డేట్ ఫిక్స్

Coming next week: ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీవిష్ణు ‘భళా తందనాన’ టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి ఈ చిత్రాని దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించిన‌ ఈ సినిమా మొదటి రెండు లిరికల్ వీడియోకు మంచి స్పందన లభించింది.

టీజర్, లిరికల్ వీడియోలతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచిన ‘భళా తందనాన’ చిత్ర విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదల కానుంది. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని వచ్చేవారంలోనే చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. అలాగే మే3న రంజాన్ పండగ కూడా సినిమాకు మరో అడ్వాంటేజ్ కానుంది. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కేథ‌రిన్ థ్రెసా కథానాయికగా నటించింది. శ్రీకాంత్ విస్సా రచయితగా, సురేష్ రగుతు సినిమాటోగ్రఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన ఈ చిత్రానికి టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ స్టంట్స్ అందించారు.

Also Read : నాని రిలీజ్ చేసిన శ్రీ విష్ణు ‘భళా తందనాన’ టీజర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్