Bhama Kalapam: ప్రతి తెలుగు వారింటిలో భాగమైన 100% తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’లో అద్భుతమైన ఇంటి భోజనంలాంటి థ్రిల్లర్ కామెడీ వెబ్ ఒరిజినల్ ‘భామా కలాపం’ మన ముందుకు రానుంది. ప్రముఖ నటి ప్రియమణి ఈ వెబ్ ఒరిజినల్ ద్వారా ఓటీటీ మాధ్యమంలోకి అడుగుపెడుతున్నారు. అభిమన్యు తాడిమేటి ఈ వెబ్ ఒరిజినల్‌ను డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ ఒరిజినల్ ఫిబ్రవరి 11 నుంచి ‘ఆహా’లో ప్రసారమవుతుంది. ‘డియర్ కామ్రేడ్’ డైరెక్టర్ భరత్ కమ్మ షో రన్నర్. ఈ వెబ్ ఒరిజినల్ ట్రైలర్‌ను ‘లైగర్’ స్టార్ విజయ్ దేవరకొండ విడుదల చేశారు.
సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ “నేను నలబై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. అందరూ ఆదరించారు. ఇప్పుడు మా అబ్బాయి బాపినీడు, సుధీర్‌తో కలిసి ఎస్వీసీసీ డిజిటల్ మీద చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని భావిస్తున్నాం” అన్నారు.
లైగర్ స్టార్ విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “భరత్ కమ్మ తన మొదటి సినిమా “డియర్ కామ్రేడ్”నాతో చేశాడు. తనతో సినిమా చేయాలని నేనే కోరుకున్నాను. నా కెరీర్లో నేను మరచిపోలేని చిత్రం ఇది. బాపినీడు, ప్రసాద్ గారికి, డైరెక్టర్ అభికి అభినందనలు. ఇక ప్రియమణి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఏ లాంగ్వేజ్‌లో చేసిన సూట్ అయిపోతారు. ఇప్పుడు ఆమె డిజిటల్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఆమె చేసిన ‘భామా కలాపం’ ఫిబ్రవరి 11న రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది. ఆహా టీమ్‌కు ఆల్ ది బెస్ట్” అన్నారు.
ప్రియమణి మాట్లాడుతూ… ‘భామా కలాపం అనేది నా డిజిటల్ బెస్ట్ డెబ్యూ అని చెప్పాలి. అందుకు భరత్ కమ్మ గారికి థాంక్స్. భరత్ కమ్మ గారిని, అభిమన్యు తాడిమేటిని చాలా ఇబ్బందిపెట్టాను. అందుకు వారికి థాంక్స్. మొదటి షెడ్యూల్ కోసం ఆరు రోజులు కేటాయించాను. తర్వాత షెడ్యూల్ కోసం నెలన్నర పాటు సమయం కేటాయించలేకపోయాను. తర్వాత సింపుల్‌గా, స్వీట్‌గా పూర్తి చేసేలా భరత్, అభి వర్క్ చేశారు. అనుపమ వంటి క్యారెక్టర్‌ను ఇప్పటి వరకు నేను ప్లే చేయలేదు. చాలా అమాయకమైన గృహిణి పాత్రలో కనిపిస్తాను. ఫిబ్రవరి 11న భామా కలాపం ఆహాలో ప్రసారం కానుంది. ఇంత పెద్ద ఎత్తున దీన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఆహా టీమ్‌కు థాంక్స్” అన్నారు