రాహుల్ భారత్ జోడో యాత్ర తెలంగాణలో నాల్గవ రోజు కొనసాగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్ నుంచి యాత్ర ప్రారంభమైంది. ఆయన వెంట వేల సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు నడక సాగిస్తున్నారు. రాహుల్‌తో కలిసి నడిచేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి రావడంతో ధర్మాపూర్ సందడిగా మారింది. ధర్మపూర్ నుంచి ప్రారంభమైన యాత్ర మహబూబ్‌నగర్ మీదుగా జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లి వరకు సాగనుంది. ఏనుకొండలో 10.30 గంటలకు విరామం ప్రకటించనున్నారు. అనంతరం లంచ్ చేసి సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభించనున్నారు. జడ్చర్ల జంక్షన్ రోడ్ లో రాహుల్ కార్నర్ మీటింగ్ ఉంటుంది. ఇవాళ 20 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుంది. జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లిలో రాహుల్ గాంధీ రాత్రి బస చేయనున్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర యాభై రోజులు దాటింది. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లు మీదుగా తెలంగాణకు చేరుకుంది. ఐదు రాష్ట్రాల్లోనూ రాహుల్ పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుంది. నేడు సినీ నటి పూనమ్ కౌర్ రాహుల్ తో కలిసి నడుస్తున్నారు. చేనేత కార్మికుల సమస్యలను రాహుల్ గాంధీకి వివరించిన పూనమ్ కౌర్, ఈరవత్రి అనిల్, అల్ ఇండియా చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు కాండగట్ల స్వామి, నాయకులు పద్మశ్రీ గజం అంజయ్య తదితరులు ఉన్నారు. చేనేత పైన కేంద్ర ప్రభుత్వం వేసిన 5 శాతం జిఎస్టీ ఎత్తి వేయాలని, నేత ముఫై సరుకులపై పన్నులు తొలగించాలని, గ్యాస్ ధరలు తగ్గించాలని కోరిన నేతలు. ఈ రోజు పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులతో రాహుల్ సమావేశం కానున్నారు.
Also Read : ధరణి రద్దు చేస్తాం రాహుల్ గాంధి