Sunday, November 24, 2024
HomeTrending Newsఢిల్లీ ఎర్ర‌కోట‌పై ఎగిరేది గులాబీ జెండానే : సీఎం కేసీఆర్

ఢిల్లీ ఎర్ర‌కోట‌పై ఎగిరేది గులాబీ జెండానే : సీఎం కేసీఆర్

ఢిల్లీ ఎర్ర‌కోట‌పై ఎగిరేది గులాబీ జెండానే అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్ భార‌త రాష్ట్ర స‌మితి నినాదం అని పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప్రారంభిస్తామ‌న్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుక‌లు తెలంగాణ భ‌వ‌న్‌లో అట్ట‌హాసంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ పార్టీ స‌మావేశం సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది.

ఈ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. దేశ ప‌రివ‌ర్త‌న కోస‌మే భార‌త రాష్ట్ర స‌మితి ఏర్ప‌డింద‌న్నారు. ఎన్నిక‌ల్లో గెలవాల్సింది ప్ర‌జ‌లు.. రాజ‌కీయ పార్టీలు కాద‌న్నారు. దేశానికి ఇప్పుడు కొత్త ఆర్థిక విధానం అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. జాతీయ స్థాయిలో కొత్త ప‌ర్యావ‌ర‌ణ విధానం అమ‌లు కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మ‌హిళా సాధికారిక‌త కోసం కొత్త జాతీయ విధానం అమ‌లు చేయాల‌న్నారు. రాబోయేది రైతు ప్ర‌భుత్వ‌మే అని సీఎం స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లోనే పార్టీ పాల‌సీలు రూపొందిస్తామ‌న్నారు. రైతుపాల‌సీ, జ‌ల‌ విధానం రూపొందిస్తాం అని పేర్కొన్నారు.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌ఫున ప్ర‌చారం నిర్వ‌హిస్తాం. కుమార‌స్వామి క‌ర్ణాట‌క సీఎం కావాల‌న్నారు. నాలుగైదు నెల‌ల్లో ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాల‌యం ప్రారంభ‌మ‌వుతుంద‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్