Sunday, February 23, 2025
HomeTrending Newsఅపోలో ఆస్పత్రిలో భట్టి విక్రమార్క

అపోలో ఆస్పత్రిలో భట్టి విక్రమార్క

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్కకు కరోనా వైరస్ సోకడంతో స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన ఆదివారం రాత్రి హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు. అపోలో ఆసుపత్రి వైద్యులు కోవిడ్ కు సంబంధించిన అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. భట్టి విక్రమార్క ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు తప్పనిసరిగా covid పరీక్షలు చేయించుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని ఆయన కోరారు. కరోనా విజృంభన నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని కోరారు. కార్యకర్తలు, నాయకులు తనను కలవడానికి హైదరాబాద్ రావద్దని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తాను అందర్ని కలుస్తాను అని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్