Saturday, April 20, 2024
HomeTrending Newsతెలంగాణలో అన్ని పరీక్షలు వాయిదా

తెలంగాణలో అన్ని పరీక్షలు వాయిదా

కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రకటించింది. దీంతో తెలుగు రాష్ట్రాల పరిధిలో ఈనెల 30వరకు నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షల కొత్త షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు www.braouonline.in వెబ్‌సైట్‌లో చూడొచ్చని అధికారులు సూచించారు. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలు విద్యార్థులకు సంక్రాంతి సెలవులను ఈనెల 30 వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశాయి. దీంతో అన్ని యూనివర్సిటీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. మంగళవారం నుంచి జరగాల్సిన డిగ్రీ పరీక్షలు సైతం వాయిదా వేసినట్లు ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించింది. మరోవైపు సోమవారం నుంచి ఈనెల 30 వరకు ఆన్ లైన్‌లో క్లాసులు నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్