Sunday, January 19, 2025
Homeసినిమాభవదీయుడు భగత్ సింగ్ పై క్లారిటీ ఇచ్చిన పవన్.?

భవదీయుడు భగత్ సింగ్ పై క్లారిటీ ఇచ్చిన పవన్.?

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని ప్రకటించి సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ.. సెట్స్ పైకి మాత్రం రావడం లేదు. డైరెక్టర్ హరీష్‌ శంకర్ మాత్రం పవర్ స్టార్ డేట్స్ ఇస్తారనే ఆశతో అలా ఎదురు చూస్తునే ఉన్నాడు. కొన్ని నెలల కిందట మైత్రీ మూవీ మేకర్స్ వారి ‘అంటే సుందరానికీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పవన్ హాజరయ్యారు.

ఆ వేడుకలో త్వరలోనే భవదీయుడు భగత్ సింగ్ సినిమా స్టార్ట్ అవుతుందని పవన్ చెప్పారు కానీ.. జరగలేదు. సమీప భవిష్యత్తులోనూ ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందనే సూచనలు ఎంత మాత్రం లేవు. తాజా సమాచారం ప్రకారం.. ఇక దర్శక నిర్మాతలకు పవన్ ఒక క్లారిటీ ఇచ్చేసినట్లు తెలిసింది. ఇంకా వాళ్లను ఆశల పల్లకిలో ఊరేగించడం కరెక్ట్ కాదని భావించిన పవన్.. 2024 ఎన్నికల తర్వాత ఈ సినిమా సంగతి చూద్దామని స్పష్టంగా చెప్పేశాడట. తనకున్న పొలిటికల్ కమిట్మెంట్ల దృష్ట్యా ‘హరి హర వీరమల్లు’ మినహా వచ్చే ఎన్నికల్లోపు మరే సినిమా కూడా చేసే పరిస్థితి లేదని చెప్పారట.

విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్ సినిమాను పూర్తి చేయడమే కష్టంగా ఉందని.. కాబట్టి భవదీయుడు భగత్ సింగ్ మూవీని పక్కన పెట్టేసి వేరే సినిమాలు చూసుకోవాలని మైత్రీ అధినేతలకు, అలాగే దర్శకుడు హరీష్‌ శంకర్ కు పవన్ క్లారిటీ ఇచ్చేసినట్లు సమాచారం. అందుకనే హరీష్ శంకర్ వేరే హీరోతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. పాపం.. హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఆఖరికి ఇలా అయ్యింది. ఈ సినిమా ప్రకటించకపోయుంటే.. హరీష్ శంకర్ ఇప్పటి రెండు సినిమాలు చేసేవాడు. మరి.. ఇక నుంచైనా ఇంత గ్యాప్ రాకుండా సినిమాలు చేస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్