Sunday, September 8, 2024
HomeTrending Newsభోళా శంకర్ మూవీ రిలీజ్ ఎప్పుడు..?

భోళా శంకర్ మూవీ రిలీజ్ ఎప్పుడు..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే సినిమాలో నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఈ భారీ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇందులో చిరంజీవి సరసన శృతి హాసన్ నటిస్తుంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ మూవీ సాంగ్ అండ్ టీజర్ కు అనూహ్య స్పందన లభించింది. సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు కానీ.. ఇంకా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది అనౌన్స చేయలేదు. దీంతో మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాతో పాటు చిరంజీవి భోళా శంకర్ అనే సినిమా కూడా చేస్తున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చిరంజీవికి జంటగా మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తుంటే… చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ మూవీని భారీ చిత్రాల నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఆమధ్య ఈ సినిమా షూటింగ్ లో కూడా చిరంజీవి పాల్గొన్నారు. అయితే.. సంక్రాంతికి వాల్తేరు వీరయ్య రిలీజ్ అని ప్రకటించడం… ఈ సినిమా షూటింగ్ చేయాల్సింది ఎక్కువ పార్ట్ ఉండడంతో భోళా శంకర్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. మళ్లీ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో చిరు జాయిన్ కానున్నారని సమాచారం.

వాల్తేరు వీరయ్య సంక్రాంతికి వస్తుంది. మరి.. భోళా శంకర్ మూవీ ఎప్పుడు రిలీజ్ కానుంది అంటే… ఉగాదికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.వాల్తేరు వీరయ్య రిలీజ్ అయిన తర్వాత నుంచి భోళా శంకర్ పై ఫోకస్ పెట్టనున్నారని తెలిసింది. ఇందులో చిరంజీవి, కీర్తి సురేష్ మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా ఉంటాయని.. ఖచ్చితంగా అందరికీ ఈ సినిమాని నచ్చేలా మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారని చిత్రయూనిట్ చెబుతుంది. మరి.. గాడ్ ఫాదర్ మూవీతో మెప్పించిన మెగాస్టార్ వాల్తేరు వీరయ్యగా, భోళా శంకర్ గా కూడా ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్