Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం భోళా శంకర్. ఇందులో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుండగా, కథానాయికగా తమన్నా నటిస్తుంది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఆమధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది.
తమిళ్ లో అజిత్ హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ సాధించిన వేదాళం చిత్రానికి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతోంది. ఈ మూవీలో సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే యాక్షన్ ఉంటుంది. అయితే.. చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య అప్ డేట్స్ వస్తున్నాయి కానీ.. భోళా శంకర్ అప్ డేట్స్ మాత్రం రావడం లేదనుకునే వారి కోసం భోళా శంకర్ నుంచి అప్ డేట్ వచ్చింది. ఇంతకీ భోళా శంకర్ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ మూవీ టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగష్టు 22న విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోందట. ఆ రోజున పక్కాగా టీజర్ రావడం ఖాయం అని టాక్ వినిపిస్తోంది. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ చిరంజీవి కన్నా మెహర్ రమేష్ కే కీలకం. ఈసారి ఖచ్చితంగా సక్సెస్ సాధించాలనే పట్టుదలతో మెహర్ వర్క్ చేస్తున్నారు. మరి.. బాక్సాఫీస్ దగ్గర భోళా శంకర్ ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.
Also Read : మెగా మాస్ మేనియా.. ‘భోళా శంకర్’ ఫస్ట్ లుక్