Monday, February 24, 2025
Homeసినిమామరో సాంగ్ వచ్చేసింది.. 'మిల్కీ బ్యూటీ నువ్వే నా స్వీటీ’ అంటున్న చిరు..

మరో సాంగ్ వచ్చేసింది.. ‘మిల్కీ బ్యూటీ నువ్వే నా స్వీటీ’ అంటున్న చిరు..

చిరంజీవి మెగా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర భారీ కాన్వాస్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ తో పాటు ‘భోళా మానియా’, ‘జామ్ జామ్ జజ్జనక’ పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం థర్డ్ సింగిల్ ‘మిల్కీ బ్యూటీ’ పాటని సెన్సేషనల్ కంపోజర్ తమన్ లాంచ్ చేశారు.

మహతి స్వర సాగర్ ఈ పాటని లవ్లీ లైవ్లీ మెలోడీగా స్వరపరిచారు. విజయ్ ప్రకాష్, సంజన కల్మంజే కలసి మహతి స్వర సాగర్ ఈ పాటని గ్రేస్ ఫుల్ గా ఆలపించారు. ‘సరస్వతి పుత్ర’ రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఆకట్టుకుంది.

ఈ పాటలో చిరంజీవి డాన్స్, స్వాగ్ మెస్మరైజింగా వున్నాయి. మెలోడీ పాటల్లో మెగాస్టార్ డ్యాన్స్ చూడటానికి ప్రేక్షకులు ప్రత్యేకంగా ఎదురుచూస్తుంటారు. ఈ పాటలో మెగా డ్యాన్స్ మూమెంట్స్ కన్నుల పండగలా వున్నాయి. మెగాస్టార్ తో కలసి తమన్నా చేసిన డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ పాటలో వారి కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్