Saturday, January 18, 2025
HomeసినిమాRam Charan: కోహ్లి బయోపిక్ లో చరణ్. అసలు నిజం ఇదే

Ram Charan: కోహ్లి బయోపిక్ లో చరణ్. అసలు నిజం ఇదే

రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ భారీ పాన్ ఇండియా మూవీకి శంకర్ డైరెక్టర్. ఈ సినిమా తర్వాత చరణ్.. డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాని ఎప్పుడో ప్రకటించారు కానీ.. గేమ్ ఛేంజర్ ఇంకా పూర్తి కాకపోవడం వలన బుచ్చిబాబుతో సినిమా ఆలస్యం అవుతుంది. తాజాగా చరణ్ టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బయోపిక్ లో నటించనున్నట్టుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. దీని గురించి తెలుగు మీడియాలోనే కాకుండా.. జాతీయ మీడియాలో సైతం కథనాలు వచ్చాయి.

దీంతో చరణ్‌.. కోహ్లి బయోపిక్ లో నటించడం అనేది నిజమే అనుకున్నారు. తెలుగు ఆడియన్స్ లో ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. డైరెక్టర్ ఎవరు..? నిర్మాత ఎవరు..? ఇలా రకరకాల చర్చలు మొదలయ్యాయి. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందని టాక్ వచ్చింది. అంతే కాకుండా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యిందని.. త్వరలో ఈ సినిమాని అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని వార్తలు వచ్చాయి. చరణ్, కోహ్లి బయోపిక్ లో నటించాలని ఉందని గతంలో చెప్పాడు. దీనిని బట్టి ఈ మూవీ కన్ ఫర్మ్ అని ప్రేక్షకాభిమానులు ఫిక్స్ అయ్యారు.

అయితే.. చరణ్ హీరోగా కోహ్లి బయోపిక్ అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని.. ఇప్పటి వరకు అసలు కోహ్లి బయోపిక్ కు సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదని తెలిసింది. దీంతో చరణ్‌ కోహ్లి బయోపిక్ అనేది గ్యాసిప్ అని తెలిసిపోయింది. ఇప్పటి వరకు చర్చలు జరగలేదు.. ఇప్పటి నుంచైనా ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచించండి అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి.. భవిష్యత్ లో కోహ్లి బయోపిక్ లో చరణ్ నటించే ఛాన్స్ ఉంటుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్