Saturday, January 18, 2025
Homeసినిమాస్టార్ హీరోల దృష్టి ఆ పండగపైనే! 

స్టార్ హీరోల దృష్టి ఆ పండగపైనే! 

ఈ సంక్రాంతికి పండుగకి భారీ సినిమాలన్నీ ఒకేసారి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి ఇంతకంటే గట్టిపోటీ ఉండేలా కనిపిస్తోంది. చిరంజీవి కథానాయకుడిగా శ్రీవశిష్ఠ  ‘విశ్వంభర’ సినిమాను రూపొందిస్తున్నాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. దేవలోకం నేపథ్యంలో నడిచే సీన్స్ ఉండటంతో…ఎక్కువ మంది కథానాయికలు సందడి చేయనున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానమైన కథానాయికగా త్రిష అలరించనుంది. ఇటీవలే ఆమె ఈ షూటింగులో జాయిన్ అయింది.

యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో ‘విశ్వంభర’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నట్టుగా  ముందుగానే ప్రకటించారు. అలా ఈ సినిమా సంక్రాంతికి రావడమనేది ఖాయమైపోయింది. ‘అఖండ’ సీక్వెల్ కూడా అదే రోజున థియేటర్లకు వచ్చే అవకాశాలు ఉన్నాయటనే టాక్ బలంగానే వినిపిస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్టుతో బాలయ్య – బోయపాటి సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఇక వెంకటేశ్-అనిల్ రావిపూడి సినిమా కూడా సంక్రాంతికి తమ సినిమాను బరిలోకి దింపాలనే  ఆలోచనతోనే రంగంలోకి దిగుతున్నారు. గతంలో వెంకటేశ్ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘ఎఫ్ 2’ .. ‘ఎఫ్ 3’ విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో, కథానాయికగా త్రిష కనిపించనుందనే టాక్ నడుస్తోంది. ఇక నాగార్జునకి కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఉంది గనుక, ఆయన కూడా ఆ దిశగా ఏమైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్