Wednesday, March 26, 2025
HomeTrending Newsమీ త్యాగాలు మేం భరించలేం: సోము

మీ త్యాగాలు మేం భరించలేం: సోము

We Can’t: చంద్రబాబు చెబుతున్న త్యాగాలు భరించడానికి తమ పార్టీ సిద్ధంగా లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీ గతంలో ఎన్నో త్యాగాలు చేసిందని, ఇప్పుడు మళ్ళీ  కుటుంబ, అవినీతి పార్టీల కోసం త్యాగం చేయడానికి తయారుగా లేదని స్పష్టం చేశారు. త్యాగాలకు, అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామని, జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజా పోరాటంలో కలిసి రావాలంటూ విపక్ష పార్టీలకు టిడిపి అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపై సోము స్పందించారు.  విజయవాడలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న సోము వీర్రాజు తన ప్రసంగంలో పొత్తుల అంశాన్ని, చంద్రబాబు వ్యాఖ్యను ప్రస్తావించారు.

ఏపీ అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని, దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాష్ట్రంలో చివరి  వ్యక్తి వరకూ చేర్చేందుకు కృషి చేస్తున్నామని, తద్వారా రాష్ట్రంలో బలపడి 2024 లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సోము విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీల విషయంలో పార్టీకి ఓ స్పష్టమైన వైఖరి ఉందన్నారు. పార్టీ బలోపేతం చేస్తున్నామని, జూన్ మొదటి వారంలో విజయవాడ, రాజమండ్రిలలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నామని, దీనికి జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు హాజరవుతారని సోము వెల్లడించారు.  తమ పార్టీ పొత్తు జనంతో‌… అవసరమైతే జనసేనతో ఉంటుందని నర్మగర్బ వ్యాఖ్యలు చేశారు సోము.  ఇప్పటికే జనసేనకు రోడ్ మ్యాప్ ఇచ్చామని, 2024లో బీజేపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్