BJP AP For Amaravathi:
ఈ నెల 21న అమరావతి మహా పాదయాత్రలో పాల్గొంటామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు ప్రకటించారు. విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర స్థాయి పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో సోము ప్రసంగించారు. ఈ సందర్భంగా అమరావతి అంశాన్ని అయన ప్రస్తావించారు, రాజధాని విషయంలో మొదటి నుంచీ బిజెపి ఏపీ శాఖ స్పష్టమైన వైఖరితో ఉందని, అమరావతిలోనే రాజధాని కొనసాగాలన్నది తమ విధానమని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధి బిజెపితోనే సాధ్యమని పునరుద్ఘాటించారు.
తమ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది ముఖ్యం కాదని, అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి పాటు పడడమే తమ ఉద్దేశమన్నారు. విజయవాడలో మూడు ఫ్లై ఓవర్లు నిర్మించామని, దుర్గ గుడి ఫ్లై ఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్లు అనుకున్న సమయానికంటే ముందే పూర్తి చేసి ప్రజలకు అకితం చేశామని, మరో మూడు ఫ్లై ఓవర్లు మంజూరయ్యయని చెప్పారు. అమరావతి మీదుగా ఇబ్రహింపట్నం వరకు ఒక బ్రిడ్జిని నిర్మిస్తున్నామని, దీనితో అమరావతి ఇక్కడే ఉండాలన్నది బిజెపి విధానంగా స్పష్టంగా చెబుతున్నా మన్నారు. గత ప్రభుత్వం 7200 కోట్ల రూపాయల ఖర్చుతో తాత్కాలిక రాజధాని నిర్మాణం చేస్తే, కేంద్రం 1800 కోట్ల రూపాయలతో సకల సదుపాయాలతో ఎయిమ్స్ ను నిర్మించిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలకు నిధులు ఇస్తుంటే వాటిని సిఎం జగన్ తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని సోము వీర్రాజు విమర్శించారు.
Must Read : అది టిడిపి కార్యకర్తల పాదయాత్ర: బొత్స