Sunday, January 19, 2025
HomeTrending Newsబిజెపి పోటీ నామమాత్రమే: రోజా

బిజెపి పోటీ నామమాత్రమే: రోజా

Nominal: ఆత్మకూరు నియోజకవర్గ ఉపఎన్నికల్లోబిజెపి పోటీ నామమాత్రమేనని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆ పార్టీ అనవసరంగా పోటీ చేస్తోందని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా భాగంగా చేజర్ల మండలం పాతపాడు, ఓబుళయిపల్లి, కొండల్రాయుడు కండ్రిక, గొల్లపల్లి గ్రామాల్లో రోడ్ షో, మీటింగ్ లలో  దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరితో కలిసి పాల్గొన్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పతకాలు అందిస్తున్న ఘనత సిఎం జగన్ కే దక్కుతుందన్నారు. సిఎం దావోస్ పర్యటన ద్వారా 1.25 లక్షల కోట్లరూపాయల పెట్టుబడులు తీసుకు వచ్చారన్నారు.  రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడంలేదని రోజా ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్