Sunday, January 19, 2025
HomeTrending Newsలవ్ జిహాదీ పేరుతో ప్రీతిపై కుట్ర - బండి సంజయ్

లవ్ జిహాదీ పేరుతో ప్రీతిపై కుట్ర – బండి సంజయ్

కేంద్ర ప్రభుత్వం నిధులియ్యడం లేదు… అబివృద్ది చేయడం లేదని కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నరు. నేను మిమ్ముల్ని కోరేదొక్కటే… ఒక్కసారి వరంగల్ బస్టాండ్ కు వెళ్లి చూడండి… ఆ తరువాత వరంగల్ రైల్వే స్టేషన్ కు వెళ్లి చూడండి. ఎవరు అభివ్రుధి చేశారో మీరే బేరీజు వేయండి’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలను కోరారు.
హన్మకొండలోని 54వ డివిజన్ లో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కు బండి సంజయ్ హాజరయ్యాడు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధికార ప్రతినిధి పోరెడ్డి కిశోర్ రెడ్డి తదితరులు హాజరైన ఈ మీటింగ్ లో బండి సంజయ్ ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు.

పీరియాడికల్ ఓవరాయిలింగ్ వ్యాగన్ ఫ్యాక్టరీ (POH ఫ్యాక్టరీ) కోసం కేంద్ర ప్రభుత్వం 430 కోట్లు మంజూరు చేసినం. టెండర్ ప్రాసెస్ అయ్యింది. ఇంకా ఎకరన్నం భూమి ఇయ్యాలే.. ఇంకా సాగదీస్తనే ఉన్నడు.. మళ్లా కేంద్రం ఇయ్యట్లేదని బదనాం చేస్తున్నడు. సైనిక్ స్కూల్ ఏర్పాటుకు కేంద్రం ఓకే చెప్పినా ఇంతవరకు ల్యాండ్ ఇవ్వలేదు.. సూపర్ స్పెషాలిటీ కట్టినా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సక్రమంగా వాడుకోలేని దొంగ కేసీఆర్.. స్మార్ట్ సిటీ పేరుతో తొలుత రూ.500 కోట్లిస్తే… 192 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వమని మొత్తుకున్నా ఇయ్యకపోవడంతో మిగిలిన నిధులన్నీ వెనక్కు పోయినయ్. లెక్కలియ్యకపోవడంతో ఆ తరవాత రావాల్సిన నిధులన్నీ ఆగిపోయినయి.

ఉద్యమాల పురిటగడ్డ కాకతీయ యూనివర్శిటీ… కనీస వసతుల్లేక విద్యార్థులు అల్లాడుతున్నరు. 400 మంది స్టాఫ్ ఉండాల్సిన చోట 120 మందే ఉన్నరు. ఖాజీపేట బ్రిడ్జి నిర్మించడానికి కూడా కేసీఆర్ కు చేతగాలే… చివరకు కేంద్రమే హైవే ప్రాజెక్టు కింద కేంద్రమే 12 కోట్లు మంజూరు చేసింది. 100 కోట్ల విలువగల హనుమాన్ దేవాలయ భూములను పరిరక్షించడానికి బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గత సంవత్సరంనర కాలం నుండి భూ ఖబ్జాదారుల నుండి పోరాటం చేస్తుంది. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. అధికారంలోకి వస్తే అర్హులందరికీ ఇండ్లు నిర్మిస్తాం… ఉచిత విద్య, వైద్యం అందిస్తాం… పంట నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా కింద పరిహారం అందిస్తాం.

రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు ఎక్కువైనయ్… శాంతి భద్రతలు అదుపు తప్పినయ్… ప్రీతి మెడికల్ విద్యార్థిని ర్యాగింగ్ పేరుతో మూర్ఖుడు పెట్టిన వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కొంతమంది పోలీసులు ర్యాగింగ్ చేసినోడి పక్షాన ఉంటూ ప్రీతికి అన్యాయం చేసే కుట్ర చేస్తున్నరు. లవ్ జిహాదీ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తుంటే…పోలీసులు ప్రీతి తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి లవ్ జిహాదీ కాదని చెప్పించే యత్నం చేస్తున్నరు. ప్రీతి ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటున్నా.. మొత్తం ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి.

హైదరాబాద్ లో కుక్కల దాడిలో పిల్లవాడు మరణిస్తే కుక్కలకు మటన్ దొరకకు దాడి చేశాయని మేయర్ చెబుతుండటం సిగ్గు చేటు. ఈ ఘటనపై కేసీఆర్ స్పందించకపోవడం సిగ్గు చేటు.. ఎస్సీ వర్గానికి చెందిన సాయన్న 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజా సేవలో మరణిస్తే దళితుడనే కారణంతో అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించలేదు. కేటీఆర్ సీఎం కావాలంటూ జరిగిన సంతకాల సేకరణలో సాయన్న సంతకం పెట్టకపోవడంవల్లే ఆయన భౌతిక కాయానికి అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించలేదు. నిజాం మనవడు ఈ దేశపోడు కాదు.. ఎక్కడో ఇస్తాంబుల్ లో చనిపోతే శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చి కేసీఆర్ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం సిగ్గు చేటు. తెలంగాణ ఆడబిడ్డలను బట్టలిప్పి బతకమ్మ ఆడించిన నిజాం వారసుడికి అంత్యక్రియలు నిర్వహిస్తారా? దీనిపై సమాజం స్పందించాలి.

బీఆర్ఎస్ ను తన్ని తరిమేయాలంటే బీజేపీతోనే సాధ్యం. రామరాజ్యం బీజేపీతోనే సాధ్యం. పేదవాడికి ఉన్నత అవకాశాలు బీజేపీతోనే సాధ్యం. ఛాయ్ వాలా ప్రధానిని చేసిన ఘనత బీజేపీదే. దళిత, ఆదివాసీ, మైనారిటీలను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదే. బీఆర్ఎస్ పార్టీలో లిక్కర్ దందా చేసేటోళ్లు, పత్తాల దందా చేసేటోళ్లు, భూ దందా చేసేటోళ్లే మంత్రులవుతారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరూ ఆ పార్టీలో సీఎం కాలేరు. కేసీఆర్ కొడుకు పిరికిపింద… ఆయన పేరు తీయకుండా కోర్టు నుండి స్టే తెచ్చుకున్న చేతగానోడు నన్ను విమర్శిస్తున్నాడు. అమెరికాలో చిప్పలు కడిగినోడు… అయ్య పేరుతో పదవులు తెచ్చుకున్నోడు.. ఆయన అయ్య లేకుంటే కుక్కలు కూడా దేకవ్… దేశం కోసం, ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం జైలుకు పోయిన. ప్రజల తరపున పోరాడి ఈ స్థాయికి వచ్చిన. నా గురించి మాట్లాడే అర్హత లేదు. కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కింది. బీఆర్ఎస్ పార్టీని తరిమికొడదాం.. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి… రామరాజ్యాన్ని స్థాపించుకుందాం.

Also Read : విషమంగానే ప్రీతి ఆరోగ్య పరిస్థితి

RELATED ARTICLES

Most Popular

న్యూస్