Sunday, January 19, 2025
HomeTrending NewsBJP Hatao : ప్రజల మధ్య బిజెపి చిచ్చు - సిపిఐ

BJP Hatao : ప్రజల మధ్య బిజెపి చిచ్చు – సిపిఐ

బిజెపిని గద్దె దించితేనే దేశంలో మత విభేదాలు తగ్గుతాయని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి అన్నారు. ఇందుకోసం రాబోయే ఎన్నికల్లో లౌకిక పార్టీలు ఏకం కావాలని స్పష్టం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో బిజెపి హటావో దేశ్ కి బచావో అనే నినాదంతో 11వ రోజు పల్లె పల్లెకు సిపిఐ…  ప్రజల వద్దకు సిపిఐ జనచైతన్య యాత్ర జగిత్యాల జిల్లా గొల్లపల్లి గ్రామానికి ఈ రోజు చేరుకుంది. జాతీయ సమితి ఇచ్చిన పిలుపుమేరకు  సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణు జగిత్యాల జిల్లా కార్యదర్శి వెన్న సురేష్ లు యాత్రలో పాల్గొన్నారు.  గొల్లపల్లి గ్రామ ప్రజలు డప్పు చప్పులతో ఘనస్వాగతం పలికారు.

తెలంగాణలో అధికారంలోకి రావాలని బిజెపి ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని వెంకట్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో మత కల్లోలాలు సృష్టించేందుకు బిజెపి నేతలు కుట్ర చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మత శక్తుల్ని అడ్డుకునేందుకు సిపిఐ ముందుండి పోరాడుతుందని చెప్పారు. బిజెపి ని అడ్డుకోపోతే రాబోయే రోజుల్లో దేశంలో కల్లోల పరిస్థితులు తప్పవని చాడ వెంకట్ రెడ్డి హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్