Sunday, February 23, 2025
HomeTrending Newsజంగారెడ్డికి నేతల నివాళి

జంగారెడ్డికి నేతల నివాళి

Tributes: భారతీయ జనతా పార్టీ కురు వృద్ధుడు, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డికి రాష్ట్ర బిజెపి నేతలు ఘనంగా నివాళులర్పించారు. వయోభారంతో నేటి ఉదయం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జంగారెడ్డి కన్నుమూశారు. అయన వయస్సు 87 సంవత్సరాలు. అయన 1967లో ఎమ్మెల్యేగా, 1984లో దేశవ్యాప్తంగా బిజెపి కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుపొందగా ఆ ఇద్దరిలో జంగారెడ్డి ఒకరు. నాటి కాంగ్రెస్ సీనియర్ నేత పివి నరసింహారావు పై హన్మకొండ లోక్ సభ నియోజకవర్గం నుంచి 54 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. జనసంఘ్ లో కూడా జగ్గారెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు.

అయన బౌతిక కాయాన్ని పార్టీ కార్యకర్తల సందర్శనార్ధం రాష్ట్ర బిజెపి కార్యాలయానికి తరలించారు. అనంతరం హన్మకొండలోని అయన స్వగృహానికి తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జంగారెడ్డి పార్దివదేహానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్, కేంద్రమంత్రి జి.కిషరెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్