కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పై అనర్హత వేడు మోడీ నియంతృత్వానికి పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. దీనితో మోడీ అసలు స్వరూపం బట్టబయలు అయ్యిందని ఆయన విరుచుకుపడ్డారు. ఈ మెరకు శుక్రవారం సాయంత్రం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశానికి చీకటి రోజులు అలుముకున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విపక్షాల అణిచివేత కేంద్రం ఎంచుకున్న మార్గంగా కనిపిస్తుందని ఆయన దుయ్యబట్టారు. ఎనిమిదేళ్లుగా బిజెపి ప్రభుత్వం చేస్తున్న తంతు అదే నంటూ ఆయన ధ్వజమెత్తారు. విపక్షాల అణిచివేతకే మోడీ సర్కార్ ఈ డి,ఐటి,సిబిఐ లను దుర్వినియోగం చేస్తుందని ఆయన ఆరోపించారు. బిజెపి దుర్మార్గాలకు కాలం చెల్లిందని ప్రజాక్షేత్రం లో గుణపాఠం తప్పదని మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

Also Read : Rahul Gandhi Disqualified:రాహుల్ గాంధిపై అనర్హత వేటు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *