Tuesday, March 19, 2024
HomeTrending Newsమోడీ పాలనలో ఆదానీకే మేలు - మంత్రి ప్రశాంత్ రెడ్డి

మోడీ పాలనలో ఆదానీకే మేలు – మంత్రి ప్రశాంత్ రెడ్డి

బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం బాల్కొండ మండల కేంద్రంలో జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి – నీరజారెడ్డి దంపతులు సతీసమేతంగా పాల్గొన్నారు. పార్టీ జిల్లా ఇంఛార్జి మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్, డా.మధు శేఖర్, కోటపాటి నర్సింహ నాయుడు, బాల్కొండ మండల బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సతీ సమేతంగా పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…
బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులను ఇక్కడ ఓ పండుగ వాతావరణంలో ఇంటిల్లిపాదితో అందర్నీ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్,వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ల ఆదేశాల మేరకు బి ఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తన తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి మూడు విలువైన మాటలు చెప్పారని రాజకీయాల్లో ఇవి కచ్చితంగా ఉండాలని సూచించారని గుర్తు చేసుకున్నారు. 1.పార్టీ పట్ల విధేయత 2.నాయకుని మాట జవదాటకుండా పూర్తి విశ్వాసంగా ఉండడం.3.ఎన్నుకున్న ప్రజలకు,నమ్ముకున్న కార్యకర్తలకు, పార్టీలకు అతీతంగా సేవ చేయాలని చెప్పారన్నారు. పసుపు బోర్డు పేరుతో రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసి ఎంపి అయిన అరవింద్..బాండ్ పేపర్ కున్న వాల్యూ పోగొట్టాడని ఎద్దేవా చేశారు. రైతుబంధును కాపీ కొట్టి ప్రవేశపెట్టిన ప్రధానికిసాన్ సమ్మాన్ యోజన పథకం ప్రారంభంలో నిజామాబాద్ జిల్లాలోఎంత మందికి వచ్చింది..ఇప్పుడు ఎంత మందికి వస్తుందో..ఎంపి అర్వింద్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పసుపుకు మద్దతు ధర లేదు,ఎర్ర జొన్నలకు మద్దతు ధర లేదని ఎంపి అర్వింద్ కు రానున్న రోజుల్లో ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు.
మోడీ పాలన వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు అరిగోస పడుతున్నారని మండిపడ్డారు. తనకు అనుకూలమైన అదానీ లాంటి కార్పొరేట్ దోస్తులకు 12 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేశారనీ,ఆ మాఫీ చేసిన డబ్బులతో బీజేపీ ప్రత్యర్థి రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొంటూ అక్కడి ప్రభుత్వాలను కూలదోస్తున్నరని మండిపడ్డారు. అట్లా 12 రాష్ట్రాల ప్రభుత్వాలను కూలదోషారని తెలిపారు. అట్లాగే మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం కూలదోయాలని కుట్రలు చేస్తే కేసిఆర్ అడ్డు పడ్డారని అన్నారు. గ్యాస్,పెట్రోల్, డీజిల్,ఎరువుల ధరలు రెట్టింపు చేశారని దీంతో సామాన్యులపై అదనపు భారం పడుతుందన్నారు. పేదలను,రైతులను పీడిస్తూ…తన కార్పొరేట్ మిత్రులకు దేశ సంపదను దోచి పెడుతున్న మోడీని కేసిఆర్ ప్రశ్నిస్తున్నడని అందుకే కేసిఆర్ ను కట్టడి చేయాలని ఆయన బిడ్డ కవితమ్మను కేసుల పేరుతో వేధిస్తున్నరన్నారు. లక్షల కోట్లు దోచుకున్న మోడీ దోస్త్ అదానీ మీద సమగ్ర విచారణ చేయాలని మంత్రి వేముల డిమాండ్ చేశారు.

Also Read : బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్