Monday, January 20, 2025
HomeTrending Newsపార్టీ పదవుల్లో నితిన్ గడ్కరికి మొండి చేయి

పార్టీ పదవుల్లో నితిన్ గడ్కరికి మొండి చేయి

బిజెపి నాయకత్వం కీలక నిర్ణయం వెలువరించింది. బిజెపి పార్లమెంటరీ బోర్డు, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలకు కొత్త రూపం ఇచ్చింది. ఈ రోజు కొత్త కమిటీలు ప్రకటించిన బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. బిజెపి పార్లమెంటరీ బోర్డులో 11 మంది సభ్యులు ఉంటారు. ఈ బోర్డులో నడ్డ తో సహా ప్రధాని మోడీ, అమిత్ షా సహా రాజ్ నాథ్ సింగ్ సబ్యులుగా ఉంటారు. పార్లమెంటరీ బోర్డులో తెలంగాణ నుంచి ఎంపి కే లక్ష్మణ్ కు అవకాశం ఇచ్చారు.

పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడుగా జగత్ ప్రకాష్ నడ్డ వ్యవరిస్తారు. సభ్యుల వివరాలు

1. ప్రధాని నరేంద్ర మోడీ,
2. రాజ్ నాథ్ సింగ్
3. అమిత్ షా
4. యడ్యూరప్ప,
5. శర్భా నంద్ సోనా వాల్,

6.బి ఎల్ సంతోష్
7. కె లక్ష్మణ్,
8.ఇక్బాల్ సింగ్ లాల్ పుర
9. సుధా యాదవ్,

10.సత్యనారాయణ జటీయా,

బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీకి అధ్యక్షుడుగా నడ్డా వ్యవహరిస్తారు.

సభ్యులుగా
1. ప్రధాని నరేంద్ర మోడీ,
2. రాజ్ నాథ్ సింగ్,
3. అమిత్ షా
4.యడ్యూరప్ప,
5.శర్భా నంద్ సోనా వాల్,
6.కె లక్ష్మణ్,
7.ఇక్బాల్ సింగ్,
8.సుధా యాదవ్,

9.సత్యనారాయణ జటీయా,
10 బూపేంద్ర యాదవ్
11.దేవేంద్ర ఫండవిస్
12.హోం మాధుర్
13.వనతి శ్రీనివాస్
14.బి ఎల్ సంతోష్

15 కె లక్ష్మణ్,

రానున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో మార్పులు చేశారని చెపుతున్నా… బిజెపి దృష్టి అంతా దక్షిణాది పైనే ఉంది అనే వాదన బలపడుతోంది. మరోవైపు ఈ దఫా మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఛాన్స్ రాలేదు. బిజెపిలో కీలక నేత, స్వతంత్ర నిర్ణయాలతో వ్యవహరించే నీతిన్ గడ్కరికి అవకాశం ఇవ్వకపోవటం చర్చనీయంశంగా మారింది. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో ముక్కుసూటిగా వ్యవహరించే నితిన్ గడ్కరిని కీలకమైన కమిటీలలో తీసుకోకపోవటంపై విదర్భ ప్రాంత నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నాగపూర్ ఎంపిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పాలన వ్యవహారాల్లో దక్షత చాటిన నీతిన్ గడ్కరి సంఘ్ పరివారానికి నమ్మకస్తుడనే పేరుంది. బిజెపి నూతన కమిటీల కూర్పు పర్యవసానాలు.. పరిణామాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్