RTI War: జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతమైన ఊపుతో బిజెపి తెలంగాణ శాఖ తమ కార్యాచరణను మరింత వేగంగా ముందు తీసుకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. దీనిలో భాగంగానే బిజెపి అధిష్టానం నిన్న పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేసి కేంద్ర మంత్రులను వీటికి ఇన్ ఛార్జ్ లుగా నియమించిన సంగతి తెలిసిందే. నేడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మరో కొత్త అస్త్రం సంధించారు.
తొమ్మిదేళ్లుగా కేసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు విషయంలో సమాచారాన్ని కోరుతూ సమాచార హక్కు చట్టానికి దరఖాస్తు చేశారు. సిఎంవో, ప్రభుత్వ ప్రకటనలు, ఆర్ధిక, సాగునీటి పారుదల, పోడు భూములు, సిఎం కేసియార్ జిల్లాల పర్యటనలలో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలుకు నోచుకున్నాయి, సిఎం సచివాలయానికి ఎన్ని రోజులు వచ్చారు, ఎన్ని రోజులు ఫాం హౌస్ లో ఉన్నారు, ఉద్యోగాల భర్తీ, సిఎం ఇతర రాష్ట్రాల పర్యటనలకు వెళ్ళినప్పుడు ఆయన బస చేసిన హోటల్ ఖర్చుల వివరాలు, వినియోగించిన విమానాల ఖర్చులు.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు సహా మొత్తం 88 అంశాలను సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని బండి కోరారు.
Also Read : ఫెయిల్యూర్స్ కు కారణం ప్రభుత్వ వైఫల్యమే- బండి సంజయ్