Friday, April 19, 2024
HomeTrending Newsజనసేన నేతల అరెస్టును ఖండించిన బాబు, సోము

జనసేన నేతల అరెస్టును ఖండించిన బాబు, సోము

విశాఖలో జనసేన నేతలు, కార్యకర్తల అరెస్టులను తెలుగుదేశం, బిజెపిలు తీవ్రంగా ఖండించాయి.  వెంటనే అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ఒక పార్టీ అధినేత కారులో కూర్చోవాలో.. బయటకు వచ్చి అభివాదం చెయ్యాలో కూడా పోలీసులే నిర్ణయిస్తారా? అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు.

“విశాఖలో వైసిపి ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. జనసేన అధినేత పవన్ కళ్యాన్ గారి జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వైసిపి చేస్తున్న కుట్రలు దుర్మార్గం. ఆయన బస చేస్తున్న హోటల్ లో సోదాలు నిర్వహించడం, నాయకులను బెదిరించడం నియంత పాలనకు నిదర్శనం. విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన పేరుతో పదుల సంఖ్యలో అక్రమంగా అరెస్ట్ చేసిన జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని వెంటనే విడుదల చెయ్యాలి. ర్యాలీకి అనుమతి అడిగిన నేతలపై హత్యాహత్నం సెక్షన్ ల కింద కేసులు పెట్టి అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను” అంటూ  చంద్రబాబు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

మరోవైపు, జనసేన నాయకులు , కార్యకర్తల పట్ల పోలీసులు అక్రమంగా కేసులు పెట్టడాన్ని బిజెపి ఆంధ్ర ప్రదేశ్ తీవ్రంగా ఖండిస్తోందని, తక్షణమే పెట్టిన కేసులు ఎత్తివేసి విడుదల చేయాలని బిజెపి రాష్ట్ర  అధ్యక్షుడు సోము వీర్రాజు  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వాం తన వైఖరు మార్చుకోకుంటే జనసేనతో కలిసి ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉన్నామని అయన హెచ్చరించారు.

Also Read: విశాఖ గర్జనకు పోటెత్తిన జనం

RELATED ARTICLES

Most Popular

న్యూస్