Monday, September 23, 2024
HomeTrending Newsఆమె దందాతో ప్రజలకేం సంబంధం - బండి సంజయ్

ఆమె దందాతో ప్రజలకేం సంబంధం – బండి సంజయ్

‘‘కేసీఆర్ బిడ్డ దొంగ దందాలతో ప్రజలకేం సంబంధం? కవిత దొంగ దందా ప్రజల కోసం చేస్తున్నారా? ఆ సొమ్ముతో రుణమాఫీ చేస్తున్నారా?? జీతాలిస్తున్నారా? నిరుద్యోగ భ్రుతి ఇస్తున్నారా?’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఏనాడూ తలవంచని తెలంగాణ కేసీఆర్ బిడ్డ చేస్తున్న దొంగ, లంగ దందాలతో దేశం ముంద తలవంచే పరిస్థితి నెలకొందని అన్నారు. లిక్కర్ స్కాంతో బీఆర్ఎస్ వికెట్ క్లీన్ బౌల్డ్ కాబోతోందని చెప్పిన బండి సంజయ్ లిక్కర్ స్కాం దోషులెవరినీ మోదీ ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో బండి సంజయ్ తోపాటు మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, కార్యదర్శి జయశ్రీ, జాతీయ మహిళా మోర్చా నాయకులు నళిని, కరుణాగోపాల్, తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

• తెలంగాణలో మహిళలకు అడుగడుగునా అవమానాలే. ప్రీతి హత్య జరిగితే కేసీఆర్ కొడుకుకు పరామర్శించే టైం లేదు. కానీ సానియా మీర్జా వద్దకు మాత్రం వెళతాడు. నరేంద్రమోదీ టైంలోనే కేసీఆర్ సీఎం అయ్యారు.. ఒక్కసారి ఎవరి పాలన బాగుందో బేరీజు వేసుకోండి… కేసీఆర్ తొలి కేబినెట్ లో ఒక్క మహిళ లేరు.. మహిళా కమిషన్ లేదు. ఆ పార్టీలో మహిళా అధ్యక్షురాలు ఉండదు… ఆ పార్టీలో మహిళ అంటే కవిత ఒక్కరే…బతకమ్మ ఆడాలంటే కవితే. బతుకమ్మ పేరుతో డిస్కోలు ఆడించి తెలంగాణ సంస్కృతినే దెబ్బతీసిన వ్యక్తి కవిత. కేసీఆర్ పాలనలో బతుకమ్మకే గౌరవం లేకుంటే ఇగ సాధారణ మహిళలకేం గౌరవం ఉంటుంది.

• బీజేపీ సంస్థాగత పదవుల్లో 30 శాతం మహిళలకు అవకాశం కల్పిస్తున్నాం. అట్లయితేనే జాతీయ నాయకత్వం ఆమోదిస్తుంది. రాష్ట్రపతిగా మహిళను చేశాం. 8 మంది గవర్నర్లను, 4గురు సీఎంలను, 11 మంది కేంద్ర మంత్రులను చేసిన ఘనత బీజేపీదే.

• లిక్కర్ స్కాంలో కవిత వికెట్ అవుట్. బీఆర్ఎస్ వికెట్లన్నీ క్లీన్ బౌల్డ్ కాబోతున్నరు. దొంగ సారా, పత్తాల దందా చేసేటోళ్లను వదిలే ప్రసక్తే లేదు. లిక్కర్ దందా చేస్తూ తెలంగాణ వంచదని అంటోంది… కేసీఆర్ బిడ్డ చేసిన దొంగ దందా వల్ల తెలంగాణ మహిళలు ఇయాళ తలదించుకునే పరిస్థితి ఏర్పడింది.

• కేసీఆర్ బిడ్డ దొంగ, లంగ దందాలతో ప్రజలకేం సంబంధం? ఆమె దందాలతో సంపాదించే సొమ్ముతో రైతులకు రుణమాఫీ చేస్తుందా? పేదలకు ఇండ్లు కట్టిస్తుందా? నిరుద్యోగ భ్రుతి ఇస్తుందా? ఉద్యోగులకు జీతాలిస్తుందా? ఆమె దందాతో ప్రజలకేం సంబంధం? మహిళలకు తెలంగాణలో భద్రత లేకుండా పోయింది. ఆరేళ్ల పసిపాప నుండి 60 ఏళ్ల ముసలి మహిళలపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ గూండాలు బరితెగించి హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా సీఎం కేసీఆర్ స్పందించడం లేదు.

• ప్రీతి ఘటన విషయంలో మీ పోరాటం భేష్. కేసీఆర్ సర్కార్ ప్రీతి చనిపోతే రూ.10 లక్షల సాయం చేస్తారట… కేసీఆర్ బిడ్డ వాచీకి రూ.20 లక్షలతో కొనుగోలు చేస్తారట… కేసీఆర్ కుక్కకు ఇచ్చే విలువ తెలంగాణలో ప్రజలకు దక్కడం లేదు.

• కేసీఆర్ పొరపాటున మళ్లీ సీఎం అయితే మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసేవాళ్లకు ప్రోత్సహకాలు ఇస్తారేమో..

• పాతబస్తీలో 30 వేల దొంగ బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు స్రుష్టించారు. పాతబస్తీ ఉగ్రవాదుల అడ్డాగా మారింది. పాతబస్తీలో ఏం జరుగుతోందో ప్రపంచానికి తెలియడం లేదు. రోహింగ్యాలకు అడ్డా అయ్యింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లు యధేచ్చగా వస్తున్నారు. అందుకే నేను సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తానంటే చాలా మంది విమర్శించారు. ఇప్పుడేమంటారు?

• ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళలకు భద్రత వచ్చింది. భర్త వచ్చి తలాక్…తలాక్..తలాక్ అంటే… భార్య ‘మోడీ..మోడీ…మోడీ’ అనే పరిస్థితి వచ్చింది. ఆమె అన్నదమ్ములొచ్చి బెదిరిస్తే… ‘‘యోగి …యోగి…యోగి’’అని ధైర్యంగా అనే పరిస్థితి వచ్చింది.

• ఒక్కరు ముద్దు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు వద్దు అనే నినాదం మనది… కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో అందుకు భిన్నమైన పరిస్థితి. ఎంతమందినైనా కనాలనే భావన ఆ వర్గంలో ఉంది. మహిళలను ఇబ్బంది పెట్టే దుస్థితి ఏర్పడింది. అందుకే ముస్లిం మహిళల భద్రత కోసం మోదీ ప్రభుత్వం క్రుషి చేస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్