కల్వకుంట్ల కుటుంబం ప్రతినిధులు దశల వారీగా ప్రెస్ మీట్ లు పెడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మేం నీతి మంతులం అని చెప్తున్నారని, తెలంగాణ సమాజం ఢిల్లీలో మద్యం వ్యాపారం చెయ్యమని చెప్పరా..అని ప్రశ్నించారు. బి ఆర్ ఎస్ నేతల ఆరోపణలపై ఢిల్లీలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి… తెలంగాణ ఆడబిడ్డలు మద్యం వ్యాపారం చెయ్యమని అడిగారాఅన్నారు. ఢిల్లీ నడబొడ్డున తెలంగాణ పరువు తీశారని, తల దించుకునేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రమంగా వ్యాపారం చేసి..లిక్కర్ వ్యాపారంలో ఎక్కడా రాజకీయ నాయకురాలి పేరు కనబడలేదని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో మద్యం వ్యాపారం ద్వారా.. ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తున్నారని, మద్యాన్ని ప్రధాన అదాయంగా పెట్టుకున్నారని ఆరోపించారు. అన్నా చెల్లెలు ఇద్దరు అబద్దం మాట్లాడారని, మహిళా రిజ్వేషన్ల కోసం ధర్నా చేస్తున్నందుకు ఈడి నోటీసులు ఇచ్చారని చెప్తున్నారని మండిపడ్డారు.
మహిళా రిజ్వేషన్ల గురించి అడిగే నైతిక హక్కు ఉందా అన్న కిషన్ రెడ్డి మీ ఇంటి పార్టీ అయిన మజ్లిస్ పార్టీని మహిళా బిల్లు కోసం ఒప్పిస్తారా అని సవాల్ చేశారు. మహిళా బిల్లును పార్లమెంట్ లో ఎస్పీ, ఆర్జేడీ కదా అడ్డుకుంది.. మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టే దృష్టి మరల్చేందుకు కొత్త నాటకానికి కల్వకుంట్ల కుటుంబం తెర లేపిందన్నారు. సానుభూతి కోసం చేస్తున్న డ్రామా ఇది అని ఎద్రాదేవా చేశారు.రాజ్యసభకు ఒక్క మహిళా ఎంపిని కూడా పంపని బిఆర్ఎస్ కు రిజర్వేన్లపై మాట్లాడే హక్కు ఉందా.. ఆర్థిక మంత్రిగా తెలుగు ఆడబిడ్డకు మంత్రి వర్గంలో అవకాశం ఇచ్చారన్నారు.
ఏకాభిప్రాయం వస్తే మహిళల హక్కులు కాపాడాలన్నది మా అభిప్రాయమని, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ఒక చట్టం.. సామాన్యులకు ఒక చట్టం ఉంటుందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈడి ఎవరిని పిలుస్తోంది.. ఏం చేస్తుంది అనేది మాకు తెలియదని, ఢిల్లీలో ఆప్ తో కలిసి లిక్కర్ వ్యాపారం చెయ్యాలని ప్రజలు కొరారా..అన్నారు. అక్రమ వ్యాపారానికి తెలంగాణ సమాజానికి ఎలా లింక్ పెడతారన్న కిషన్ రెడ్డి మహిళలు చిదరించుకునెలా చేస్తుంది మీరని బీ ఆర్ ఎస్ నేతల తీరును తప్పు పట్టారు. నీతి వంతులు అయితే, ఎందుకు బుజాలు తడుముకుంటున్నారని, లక్షల రూపాయలు వి సెల్ ఫోన్లను ఎందుకు ద్వంసం చేశారన్నారు.