ఉచిత పథకాలు, తాయిలాల పేరుతో జగన్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని, ప్రజలు కూడా ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఎయిమ్స్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిందని, కాకినాడలో పెట్రో కెమికల్ కారిడార్ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉందని వెల్లడించారు. కేంద్రం కేటాయిస్తున్న సంస్థలను సక్రమంగా వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అవుతోందని విమర్శించారు.
ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకుండా రాష్ట్రంలో యువతను నిర్వీర్యం చేస్తున్నారని, దీనిపై పార్టీ యువమోర్చా చేపట్టిన యువ సంఘర్షణ యాత్ర ముగింపు సభ రేపు విజయవాడలో జరుగుతుందని, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ సభకు హారవుతున్నారని చెప్పారు. రాష్ట్రంలోని 173నియోజకవర్గాల్లో యువమోర్చా యాత్ర సాగిందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించామని వీర్రాజు చెప్పారు.
Also Read : అటల్ జీ బాటలోనే మోడీ: సోము వీర్రాజు