Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Bjp Zonal Meeting : అంబేద్కర్ జయంతి పురస్కరించకుని ఏప్రిల్ 14 నుండి రెండో దశ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ జనగామ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ ఉనికి లేదన్నారు. అదే జనగామలోనే మార్చి నెలాఖరులో బీజేపీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ సత్తా చూపిస్తామన్నారు. హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన బీజేపీ జోనల్ సమావేశంలోపాల్గొన్న బండి సంజయ్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల సంఘానికి సమర్పించిన తప్పుడు అఫిడవిట్ పై ఫిర్యాదు చేసిన వారిని పోలీసులే కిడ్నాప్ చేయడం అత్యంత దారుణమని విమర్శించారు. సీఎం కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాలతో పోలీసులు ఫిర్యాదు దారులను పోలీసులే కిడ్నాప్ చేశారని, మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవినీతి, భూ కబ్జాలను సహించలేక ఫిర్యాదు చేస్తే కిడ్నాప్ చేయడం అన్యాయం అన్నారు. బీజేపీ ఆందోళనతో కిడ్నాప్ చేసిన ఫిర్యాదు దారులను పోలీసులు బయటకు తీసుకొచ్చినప్పటికీ వారిపై 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేయడం దారుణమన్నారు.

ఎన్నికల కమిషన్ మంత్రి తప్పుడు అఫిడవిట్ పై ఎన్నికల కమిషన్ విచారణ ముగిసే వరకుల 6 గురు ఫిర్యాదుదారులను జైళ్లో పెట్లడమే లక్ష్యంగా కేసులు నమోదు చేశారని, చట్టబద్దంగా కొట్లాడే ధైర్యం లేని సీఎం అడ్డగోలుగా గెలిచి అవినీతికి పాల్పడుతున్న మంత్రికి వత్తాసు పలుకుతూ కిడ్నాప్ లు చేయించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. బీజేపీ ఇలాంటి దారుణాలను అడ్డుకుని తీరుతుంది. మంత్రి రాజీనామా చేసే వరకు పార్టీ పరంగా ఆందోళనలను కొనసాగిస్తామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో మంత్రులతోపాటు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉద్యమిస్తామన్నారు.

గత ఎన్నికలకు ముందు ఆయా నేతలు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో చూపిన ఆస్తులను, ఎమ్మెల్యేలు, మంత్రులయ్యాక సంపాదించిన ఆస్తులను బేరీజు వేసి వాటి ఆధారంగా విచారణ జరిగేదాకా ప్రజా క్షేత్రంలో పోరాడతామని బండి సంజయ్ చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. హైదరాబాద్ సిటీలో బీజేపీ ఓటు బ్యాంక్ 60 శాతానికి పెరిగిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. గత ఎన్నికల ఫలితాలతోపాటు వివిధ సర్వేల్లో వెల్లడైన ఫలితాలే ఇందుకు సాక్ష్యం అన్నారు.

బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలియడంతో సీఎం కేసీఆర్ బోగస్ సర్వే ఫలితాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారని, తెలంగాణ ప్రజలు నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నరని అన్నారు. ఎన్నికలెప్పుడొచ్చినా…బీజేపీ సిద్ధం.ఈసారి అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలవడం ఖాయమని, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందన్నారు.

ఈ సమావేశంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, తెలంగాణ ఇంఛార్జీ తరుణ్ చుగ్, జాతీయ సహాయ కార్యదర్శి (సంస్థాగత) శివ ప్రకాశ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సీనియర్ నేత ఎన్.ఇంద్రసేనారెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, గరికపాటి రామ్మోహన్ రావు. ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, మంత్రి శ్రీనివాస్ (సంస్థాగత) పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలను సమర్ధిస్తూ దాదాపు 2 నిమిషాలపాటు చప్పట్లతో స్వాగతించిన బీజేపీ జోనల్ సమావేశం.

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com