Thursday, March 28, 2024
HomeTrending Newsఇస్కాన్, గురుద్వారాల దాతృత్వం

ఇస్కాన్, గురుద్వారాల దాతృత్వం

ఉక్రెయిన్ లో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు ఇస్కాన్ సంస్థ అధ్వర్యంలో భోజనం వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఉక్రెయిన్ లోని 54 ఇస్కాన్ టెంపుల్స్ లో భారతీయులతో పాటు ఇతర దేశాల ప్రజలు కూడా తలదాచుకున్నారు. రాజధాని కీవ్ లోని ఇస్కాన్ మందిరంలో పాకిస్తాన్ కు చెందిన పౌరులు కూడా ఆశ్రయం పొందారు. తమ దేశ ప్రభుత్వం యుద్ధ సమయంలో రష్యా వెంట ఉండటం తమకు ప్రాణ సంకటంగా మారిందని పాకిస్తానీయులు వాపోతున్నారు. isckon తో పాటు స్థానిక సిక్కు గురుద్వారా కూడా ఉచిత బోజన,వసతి సౌకర్యం కల్పిస్తోంది. ప్రతిరోజు కీవ్ తో పాటు వివిధ నగరాల్లో వీదుల్లో లంగర్(సాముహిక భోజనం) ఏర్పాటు చేసి భోజనం అందిస్తున్నారు. దిక్కు తోచని క్లిష్ట సమయంలో వెన్నంటి ఉన్న ఇస్కాన్, గురుద్వారా ల దాతృత్వం, సేవల్ని భారతీయులు ముఖ్యంగా వైద్య విద్యార్థులు ప్రశంసిస్తున్నారు.

మరోవైపు భారత ప్రభుత్వం చెపుతున్నట్టుగా సహాయ కార్యక్రమాలు అంతగా జరగటం లేదని కొందరు విద్యార్థులు వాపోతున్నారు. ఉక్రెయిన్ లోని భారత ఎంబసీ అధికారులు తమను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది వైద్య విద్యార్థులు ఇప్పటికి దాడులు జరుగుతున్న ప్రాంతాల్లోనే చిక్కుకుపోయారని వారు అంటున్నారు. విక్రం కుమార్ అనే భారత రాయబార కార్యాలయం అధికారి ఏ మాత్రం స్పందించటం లేదంటున్నారు. రోమానియా సరిహద్దుల్లో విద్యార్థులను చితకబాదిన సందర్భాలు ఉన్నాయని, ఎంబసీ అధికారులు సలహాలు సూచనలు చేయాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆధారాలతో సహా చూపుతున్న విద్యార్థుల వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్