అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెలుగు, తమిళ్ లో ఓ విభిన్నమైన కధాంశంతో మూవీ చేస్తున్నారు. ఇందులో నాగచైతన్య సరసన కృతి శెట్టి నటిస్తుంది. నాగచైతన్య ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర పోషిస్తుండడం విశేషం. ప్రియమణి, అరవింద్ స్వామి, వెన్నెల కిషోర్, సంపత్.. ఇలా భారీ తారాగణంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సమ్మర్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా తర్వాత నాగచైతన్య ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. డైరెక్టర్ పరశురామ్ తో కథాచర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా పై ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా మల్టీస్టారర్ అని.. ఈ సినిమాలో ప్రభాస్ తమ్ముడు నటించనున్నాడని తెలిసింది. ప్రభాస్ తమ్ముడు అంటే.. రియల్ లైఫ్ లో తమ్ముడు కాదు రీల్ లైఫ్ లో తమ్ముడు. బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ కి తమ్ముడిగా లక్ష్మణుడు పాత్రలో నటిస్తున్నాడు. ఆదిపురుష్ రిలీజ్ తర్వాత సన్నీ సింగ్ క్రేజ్ పెరుగుతోందని, అతనికి మంచి అవకాశాలు వస్తాయని ఓ అంచనా ఉంది.
అందుకే.. పరుశురామ్ నాగచైతన్య తో చేయబోయే సినిమాలో సన్నీ సింగ్ కి సెకండ్ లీడ్ క్యారెక్టర్ ఇస్తున్నాడట. పరశురామ్ ఇప్పటికే నాగచైతన్యకి ఈ కథకు సంబంధించిన పాయింట్ కూడా చెప్పాడని.. ప్రస్తుతం పరశురామ్ పూర్తి స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనుల్లో ఉన్నాడని తెలుస్తోంది. మొత్తానికి నాగచైతన్య – సన్నీ సింగ్ కాంబినేషన్ నిజం అయితే మాత్రం ప్రేక్షకుల్లో ఈ సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడడం ఖాయం. మరి.. నాగచైతన్య, సన్నీ సింగ్ కోసం పరుశురామ్ ఎలాంటి కథ రాశాడో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.