Sunday, January 19, 2025
Homeసినిమాచిరు వర్సెస్ నాగ్

చిరు వర్సెస్ నాగ్

Mega Samrat: సినిమా ఇండ‌స్ట్రీకి సంక్రాంతి, స‌మ్మ‌ర్, ద‌స‌రా అని మూడు సీజ‌న్ లు. సంక్రాంతి, స‌మ్మ‌ర్ అయిపోయింది. ఇప్పుడు ద‌స‌రా సీజ‌న్ రాబోతుంది. అందుక‌నే ద‌స‌రాకి త‌మ సినిమాలు రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ద‌స‌రాకి వ‌స్తున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాద‌ర్ మూవీని ప్ర‌క‌టించారు. మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన లూసీఫ‌ర్ మూవీని తెలుగులో గాడ్ ఫాద‌ర్ టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. దీనికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు.

ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ అతిథి పాత్ర‌లు పోషిస్తుండ‌డం విశేషం. అలాగే న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. దీంతో గాడ్ ఫాద‌ర్ మూవీ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ టీజ‌ర్ రిలీజ్ చేశారు. ద‌స‌రాకి వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు కానీ.. ఎప్పుడు వ‌చ్చేది ఇంకా డేట్ ప్ర‌క‌టించ‌లేదు.

అయితే.. కింగ్ నాగార్జున మాత్రం ద‌స‌రాకి వ‌స్తున్నాను అంటూ డేట్ తో స‌హా ప్ర‌క‌టించారు. నాగార్జున ప్ర‌వీణ్ స‌త్తారు డైరెక్ష‌న్ లో ది ఘోస్ట్ అనే భారీ యాక్ష‌న్ మూవీ చేస్తున్నారు. ఇందులో నాగార్జున స‌ర‌స‌న సోనాల్ చౌహాన్ న‌టిస్తుంది. స్టైలీష్ యాక్ష‌న్ మూవీగా రూపొందిన ఈ మూవీ నుంచి టీజ‌ర్ రిలీజ్ చేశారు. డిఫ‌రెంట్ యాక్ష‌న్ మూవీగా ఈ సినిమా బిగ్ హిట్ సాధించ‌డం ఖాయ‌మ‌నే టాక్ వినిపిస్తోంది. ద‌స‌రాకి అక్టోబ‌ర్ 5న వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఈ ద‌స‌రాకి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చిరు గాడ్ ఫాద‌ర్, నాగార్జున ది ఘోస్ట్ చిత్రాలు పోటీప‌డ‌నున్నాయి. మ‌రి.. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు విన్న‌ర్ గా నిలుస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్