కాపులకు రిజర్వేషన్స్ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. గతంలో ముస్లిం రిజర్వేషన్స్ ఎలా ఇచ్చారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని నిన్న చేసిన వ్యాఖ్యలపై సోము స్పందించారు. పేర్ని వ్యాఖ్యలు అనాలోచితమని, కాపులకు రిజర్వేషన్స్ ఇవ్వాలంటే పార్లమెంట్ ద్వారా ఇవ్వాలా అని ప్రశ్నించారు. ఈ విషయమై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. కాపులను కేంద్ర ప్రభుత్వంపైకి ఉసిగొల్పే కుట్ర చేస్తున్నారని, దీని సమర్ధంగా టిప్పు కొడతామని వ్యాఖ్యానించారు.
వైసీపీ, గతంలో టిడిపి రెండు పార్టీలూ కాపులను మోసం చేశాయని, ఇప్పుడు మరోసారి వారిని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.