Friday, March 29, 2024
HomeTrending Newsపవన్ క్షమాపణ చెప్పాలి:బొత్స డిమాండ్

పవన్ క్షమాపణ చెప్పాలి:బొత్స డిమాండ్

Seek Apology : తుని సంఘటనలో వైఎస్సార్సీపీ నేతల ప్రమేయం ఉందని పవన్‌కళ్యాణ్‌ చేసిన ఆరోపణలను రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. నిజానికి ఆ ఘటనలో ఎవరు ముద్దాయిలు? ఛార్జ్‌ షీట్‌ ఎవరిపై పెట్టారో ఒకసారి చూసుకోవాలని సూచించారు. ముద్రగడ పద్మనాభం, పల్లంరాజు, సి.రామచంద్రయ్య, తన పేర్లు పెట్టారని, ప్రస్తుతం తాను సి.రామచంద్రయ్య ఈ పార్టీలో ఉన్నామని, మరి ముద్రగడ పద్మనాభం, పల్లంరాజు ఏయే పార్టీల్లో ఉన్నారో పవన్ కు తెలియదా అని ప్రశ్నించారు.  అలా మాట్లాడినందుకు పవన్ సిగ్గు పడాలని వ్యాఖ్యానించారు. ఆయన ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని,  వెంటనే తన వ్యాఖ్యలు విత్‌డ్రా చేసుకోవాలని బొత్స డిమాండ్ చేశారు.

అమలాపురం ఘటనల్లో ఎవరి ప్రమేయం ఉందో, ఆ దాడుల వెనక ఎవరెవరున్నారో రెండు మూడు రోజుల్లో తెలుస్తుందని, అన్ని కోణాలూ బైటకు వస్తాయని బొత్స స్పష్టం చేశారు. ‘వారి ఉద్దేశం ఏమిటంటే, అక్కడ కాల్పులు జరగాలి. కొట్లాటలు, లాఠీ ఛార్జీలు జరగాలి. ఇద్దరు ముగ్గురు చనిపోవాలి. రాక్షస మనస్తత్వం. దుర్మార్గమైన ఆలోచన’ అంటూ విపక్షాలపై ధ్వజమెత్తారు బొత్స.

జిల్లాల ఏర్పాటుపై పవన్ కళ్యాణ్ కు పరిజ్ఞానం లేదని బొత్స మండిపడ్డారు. ‘జిల్లాల పేరు మార్పుకు 30 రోజుల గడువు అనేది 26 జిల్లాలు చేసినప్పుడు కూడా ఇచ్చాం. అలాగే పలు జిల్లాలకు కొత్తగా పేర్లు పెట్టాం. అల్లూరి సీతారామరాజు జిల్లా, సత్యసాయి జిల్లా అని దాదాపు ఏడు జిల్లాలకు కొత్త పేర్లు పెట్టాం. పవన్‌ వ్యాఖ్యలు చూస్తుంటే జాలి వేస్తుంది. ఎందుకంటే ఆయనకు విషయాలు తెలియవు’ అంటూ బొత్స ఫైర్ అయ్యారు.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జవసత్వాలు అయిపోయాయని అందుకే అందుకే క్విట్‌ చంద్రబాబు- క్విట్‌ టీడీపీ అంటే బాగుంటుందని బొత్స ఎద్దేవా చేశారు. ఏదో తాతల నాడు నేతులు తాగాను, ఉద్ధరించాను అంటే అది పనికి రాదని సూచించారు.  చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిన ఒక్క మంచి పని చెప్పాలని సవాల్ చేశారు. ‘నా తాలూకా ప్రోగ్రామ్‌ ఇది. నా పేటెంట్‌ ఇది. నేను దీనికి ఛాంపియన్‌ను. నా ప్రభుత్వ హయాంలోనే నేను ఈ కార్యక్రమం తీసుకొచ్చాను. రాష్ట్రానికి మేలు జరిగింది. సామాన్య ప్రజలకు మంచి జరిగింది. ఈ విధానం ద్వారా రైతాంగానికి ఆర్థికంగా చేయూతనిచ్చాను. అందరి జీవన ప్రమాణాలు పెంచాను అని చెప్పడానికి కనీసం ఒక్క ప్రోగ్రామ్‌ అయినా ఉందా?’ అని బొత్స చంద్రబాబుని సూటిగా నిలదీశారు.

Also Read : అమలాపురం గొడవకు ప్రభుత్వానిదే బాధ్యత: పవన్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్