Sunday, January 19, 2025
Homeసినిమారామ్, బోయపాటి టైటిల్ ఇదేనా..?

రామ్, బోయపాటి టైటిల్ ఇదేనా..?

రామ్, బోయపాటి కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ కు జంటగా శ్రీలీల నటిస్తుంది. బాలయ్యతో అఖండ అనే బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత బోయపాటి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. రామ్ ను సరికొత్తగా, మాస్ గా చూపించిన ఈ టీజర్ జనాలకు బాగా నచ్చేసింది. దాంతో సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఇటీవల మైసూర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేయాలి అనుకున్నారు. అనుకోవడమే కాదు ప్రకటించడం కూడా జరిగింది. అయితే.. దసరాకి బాలయ్య భగవంత్ కేసరి సినిమా రిలీజ్ కానుంది. అందుచేత బాలయ్యతో ఉన్న అనుబంధం కారణంగా ఈ మూవీ రిలీజ్ డేట్ మార్చాలి అనుకున్నారు. అక్టోబర్ 20 కంటే ముందుగా సెప్టెంబర్ 15న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. జులై ఎండ్ లేదా ఆగష్టుకు ఈ సినిమా వర్క్ కంప్లీట్ అవుతుందని సమాచారం. అయితే.. ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది అనౌన్స్ చేయలేదు కానీ.. ‘స్కంధ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రిన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా కథ ఏంటి..? అనేది బయటకు రాలేదు. మరో వైపు టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై అందరిలో అంచనాలు ఏర్పడ్డాయి. రామ్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆరేంజ్ సక్సెస్ సాధించలేదు. మరి.. ఈ భారీ పాన్ ఇండియా మూవీతో  రామ్ బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్