Saturday, January 18, 2025
HomeసినిమాBoyapati, Suriya: కోలీవుడ్‌ స్టార్‌ హీరో తో బోయపాటి సినిమా..

Boyapati, Suriya: కోలీవుడ్‌ స్టార్‌ హీరో తో బోయపాటి సినిమా..

ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భాషతో సబంధం లేకుండా.. హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ మధ్య ట్రైయాంగిల్ లవ్ నడుస్తోంది. అక్కడి హీరోలు ఇక్కడ.. ఇక్కడ హీరోలు అక్కడ. డైరెక్టర్లు, నిర్మాతలు.. ఇలా  నార్త్ సౌత్ కాంబినేషన్ లో సినిమాలు సందడి చేస్తున్నాయి.

డైరెక్టర్ బోయపాటి శ్రీను తన తొలి పాన్ ఇండియా చిత్రంగా పోతినేని రామ్ ప్రధాన పాత్రలో ‘స్కంద’ రూపొందించారు. ఈ సినిమా ఈనెల 28న ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పుడు బోయపాటి తన తదుపరి చిత్రాన్ని తమిళ స్టార్ హీరో సూర్యతో చేయనున్నాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. కోలీవుడ్ తాజా సమాచారం మేరకు బోయపాటి-సూర్య చిత్రం కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో సినిమా ప్రారంభం అవనుంది. దాంతో, తెలుగు, తమిళ భాషల్లో సరికొత్త కాంబినేషన్ అభిమానులను అలరించనుంది.

బోయపాటి శ్రీను మాస్ మసాలా చిత్రాలకు ఫేమస్ కాగా.. సూర్య ఎలాంటి పాత్రలోనైనా మెప్పించగలడు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. బోయపాటి గతంలో పలు ఇంటర్వ్యూలలో సూర్యతో కలిసి పనిచేయాలనే తన కోరికను ప్రస్తావించారు. సూర్య ప్రస్తుతం ‘కంగువ’ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శివ రపొందిస్తున్నాడు. బాలీవుడ్ నటి దిశా పటాని కథానాయికగా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా 10 భాషల్లో విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్