Tuesday, September 17, 2024
HomeసినిమాSkanda: అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్'స్కంద' - బోయపాటి శ్రీను

Skanda: అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్’స్కంద’ – బోయపాటి శ్రీను

రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్కంద’. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఇందులో రామ్ కు జంటగా శ్రీలీల నటించింది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, గ్లింప్స్ అండ్ ట్రైలర్ కు అనూహ్య స్పందన వచ్చింది. అఖండ సినిమా తర్వాత బోయపాటి చేస్తున్న మూవీ కావడంతో స్కంద మూవీ పై మరింతగా అంచనాలు పెరిగాయి. సెప్టెంబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ థండర్ ఈవెంట్ లో బోయపాటి శ్రీను మాట్లాడుతూ… మనం అందరం జై బాలయ్య అంటాం. అది మన గుండెలోపల నుంచి వచ్చే మాట. ఇలా రావడానికి ఒక కారణం వుంది. బాలకృష్ణ గారితో పదిహేనేళ్లుగా ప్రయాణం చేస్తున్నాను. ఆయన వ్యక్తికాదు.. శక్తి. ఒక పాత్ర ఇస్తే.. దాన్ని లొంగదీసుకొని ఆ పాత్రలోకి పరకాయప్రవేశం చేసే శక్తి.  బాలయ్య గారు ఆశీర్వాదంలో మన హితమే కాదు జనహితం వుంటుంది. అందుకే.. జై బాలయ్య. ఈ వేడుకు వచ్చిన మమ్మల్ని దీవించిన బాలకృష్ణ గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. మా  అఖండ 2 వుంటుంది. దాని గురించి త్వరలో చెప్తాను.

ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే.. వాళ్ళు ఎంతలా ఆదరిస్తారో చూశాను. ఈవాళ ‘స్కంద’ అనే ఓ మంచి సినిమా చేసి మీ ముందుకు వస్తున్నాను. ఒక్క మాట మాత్రం మీ అందరికీ చెప్పగలను. గుండె మీద చేయి వేసుకొని సినిమా చూడండి. ఇదొక అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్. యాక్షన్ ఎమోషన్ హై లెవల్స్ ఉండనే వుంటాయి. పరిపూర్ణమైన సినిమా స్కంద. ఒక పాత్ర ఇస్తే దాన్ని ఎలా చేయాలనే నిరంతర తపన పడే వ్యక్తి రామ్. తను ఈ స్థాయిలో ఉండటానికి కారణం అతని తపన. ఈ సినిమాలో ఎలా చేశారో ట్రైలర్ లో చూశారు. రేపు సినిమాలో చూడబోతున్నారు. శ్రీలీల డ్యాన్స్ బాగా చేస్తుందని అందరూ చెబుతున్నారు. తనలో డ్యాన్స్ గ్లామర్ తో పాటు అద్భుతమైన ఆర్టిస్ట్ వుంది.  సాయి మంజ్రేకర్ పాత్ర కూడా అద్భుతంగా వుంటుంది. శ్రీకాంత్ గారు కూడా చాలా మంచి పాత్ర చేశారు. సంతోష్ డిటాకే అద్భుతమైన కెమరా వర్క్ చేశారు. తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సైరనోడు, అఖండతో ఎలాంటి వర్క్ చేశామో చూపించాం. తను ఎంత అద్భుతం చేస్తారో స్కంద తో కూడా చూస్తారు.

ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు,  స్టంట్ శివ గారు మా టెక్ని షియన్స్  అద్భుతంగా చేశారు. నటీనటులందరికీ  పేరుపేరునా ధన్యవాదాలు. ఆస్కార్ , నేషనల్ అవార్డ్ గ్రహీత ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఇందులో మూడు పాటలు చేశారు. అల్లు అర్జున్ గారితో పాటు జాతీయ అవార్డు విజేతలందరికీ ఈ సందర్భంగా అభినందనలు. సినిమా గెలిచింది. తెలుగు పరిశ్రమ గెలిచింది. అది కావాలి.  ఒకటిని విడుదలై ఖుషి సినిమా బావుండాలి, ఆ తర్వాత రిలీజ్ అయ్యే పొలిశెట్టి బావుండాలి, ఆతర్వాత రిలీజ్ అయ్యే మన స్కంద సినిమా బావుండాలి, తర్వాత వచ్చే ప్రభాస్, బాలకృష్ణ గారి సినిమా, రవితేజ గారి సినిమా ఇలా అన్నీ గెలవాలి. మా నిర్మాత శ్రీనివాస్ గురించి ఒక్క మాట చెప్పాలి. ఈ సినిమా ఆయన తప్పితే మరొకరు చేయలేరు, మా జర్నీ ఇలానే కొనసాగాలి. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్