Sunday, January 19, 2025
Homeసినిమాబ్ర‌హ్మాస్త్ర మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

బ్ర‌హ్మాస్త్ర మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Another Brahmastram:
బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కిస్తోన్న భారీ చిత్రం ‘బ్ర‌హ్మాస్త్ర‌’. ఇందులో ర‌ణ్ బీర్ క‌పూర్, ఆలియాభ‌ట్ జంట‌గా న‌టించారు. బిగ్ బి అమితాబ్, కింగ్ నాగార్జున కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ భారీ చిత్రాన్ని బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూస‌ర్ క‌ర‌ణ్ జోహార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఈ మూవీ ఫ‌స్ట్ పార్ట్ మోష‌న్ పోస్ట‌ర్ ను ఈ రోజు హైద‌రాబాద్లో విడుద‌ల చేశారు.

ఈ మోష‌న్ పోస్ట‌ర్ ని ఒక‌సారి ప‌రిశీలిస్తే.. ‘ఈ లోకంలో ఏదో జరుగుతోంది. ఈ విషయం మామూలు మనుషులకు అర్థం కాదు. కొన్ని పురాతన శక్తులున్నాయి. కొన్ని అస్త్రాలున్నాయి.. అనే రణ్‌బీర్‌ డైలాగ్‌లతోపాటు అవన్నీ నీకు ఎందుకు కనిపిస్తున్నాయ్‌.. అసలు నువ్వు ఎవరు శివా?’ అంటూ వచ్చే ఆలియాభట్‌ సంభాషణలతో ఈ మోషన్‌ పోస్టర్‌ రూపుదిద్దుకుంది. దీనిని బ‌ట్టి ఈ సినిమా ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా మొదటి భాగాన్ని ‘బ్రహ్మాస్త్రం’.. మొదటి భాగం శివ అనే పేరుతో తెలుగులోనూ విడుదల చేస్తున్నారు.

తెలుగు వెర్షన్ ను ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి సమర్పణలో 9.9.2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి మాట్లాడుతూ.. ఆల్రెడీ ర‌ష‌స్ చూశాను. సినిమా చాలా బాగుంటుంది. నాగార్జున గారి క్యారెక్ట‌ర్ వ‌చ్చిన‌ప్పుడు అక్క‌డ ఆయ‌న క‌న‌ప‌డ‌రు. క్యారెక్ట‌ర్ క‌న‌ప‌డుతుంది. చాలా బాగుంటుంద‌ని అన్నారు. నాగార్జున మాట్లాడుతూ.. “ఇది బాలీవుడ్ వాళ్లు తీసిన బాహుబ‌లి. నా క్యారెక్ట‌ర్ న‌చ్చి ఈ సినిమా చేశాను. ప్ర‌తి ఒక్క‌రికి న‌చ్చుతుంది అనుకుంటున్నాను” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్